MLA Marrirajashekar Reddy | బస్తీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మచ్చబొల్లారం డివిజన్లోని గంగా ఎవెన్యూ కౌకూర్ హరిజన బస్తీలో నెలకొన్న పలు సమస్యలను కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
గంగా ఎవెన్యూ కౌకూర్ హరిజన బస్తీలో సీసీ రోడ్డు భూగర్భ డ్రైనేజీలు పైపులైన్లు వేయించాలని, బర్షపేట్ కౌకూర్ నల్ల పోచమ్మ తల్లి దేవాలయం వద్ద ముఖద్వార నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలని, సీసీ రోడ్లు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని, స్మశాన వాటికలో వీధి దీపాలు వేయించాలని కాలనీవాసులు ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు.
కాలనీవాసుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సందీప్ రెడ్డి, మహేష్, వినయ్, శివశంకర్, రాజేష్, వెంకటేష్, రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.
Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?
Bigg Boss 9 | బిగ్ బాస్ సందడికి టైం ఫిక్స్ అయినట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవరెవరంటే..!
Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..