Harish Rao | పంచాయతీ కార్యదర్శులను క్రమబద్దీకరించండి.. మంత్రి సీతక్కకు హరీశ్‌రావు లేఖ
Harish Rao | గ్రామాల్లో కుంటుపడిన పారిశుద్ద్యం, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ, ఇతర సమస్యల గురించి మంత్రి సీతక్కకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు.
Harish Rao | హైదరాబాద్ : గ్రామాల్లో కుంటుపడిన పారిశుద్ద్యం, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ, ఇతర సమస్యల గురించి మంత్రి సీతక్కకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా 2019లో నాటి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించింది. ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామ పంచాయతీల అభివృద్ది కోసం వారు ఎంతో శ్రమించారు. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు మంజూరు చేయడం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ అధికారుల కృషి వల్ల తెలంగాణ గ్రామాలు అభివృద్దిలో దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారాయి. నిధులు విడుదల లేకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ది ఎక్కడిక్కడే నిలిచిపోయింది. పారిశుద్ద్యం పడకేసింది. వీధి దీపాల నిర్వహణ లేక పల్లెలు అంధకారంలో ఉంటున్నాయి. చివరకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేక, ఆర్టీఏ టాక్స్ కట్టలేక అధికారులకు తాళాలు అప్పగిస్తున్న దుస్థితి వచ్చింది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినప్పటికీ, పంచాయతీ అధికారులు అప్పులు తెచ్చి మరీ నిర్వహణ కొనసాగించే ప్రయత్నం చేసారు. ఒకవైపు రోజురోజుకీ అప్పులు పెరగటం, మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం మరింత పెరిగింది. దీంతో వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తే నిధులు విడుదల మరింత కష్టతరం అవుతుందని బాధపడుతున్నారు. ఇదే విధంగా మాజీ సర్పంచులు సైతం చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు అని హరీశ్‌రావు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ కింది సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
1. గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలి.
2. చేసిన పనులకు గాను మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి.
3. “అభయహస్తం” మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలి.
4. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో స్పెషల్ డ్రైవులు నిర్వహించి, పారిశుద్ద్యం పెంపొందించాలి.
5. గత మూడు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే వారికి వేతనాలు చెల్లించాలి.
6. గతేడాది నవంబర్ లో నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం శోచనీయం. వెంటనే వారి వేతనాలు విడుదల చేయాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

