Mohammad Siraj : పొట్టి ప్రపంచ కప్ హీరో మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. జగజ్జేతగా తిరిగొచ్చిన సిరాజ్‌పై కుటుంబసభ్యులు, బంధువులు ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం ఈ స్పీడ్‌స్టర్ అమ్మ షబానా బేగం (Shabana Begum)కు తన వరల్డ్ కప్ మెడల్‌ను అపూర్వ కానుకగా ఇచ్చాడు. తల్లి మెడలో విశ్వ విజేత పతకాన్ని వేసి హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ మురిసిపోయాడు. షబానా కూడా కుమారుడిని అభినందిస్తూ .. సంతోషాన్ని పట్టలేకపోయింది.
కరీబియన్ గడ్డపై వరల్డ్ కప్ ట్రోఫీ గెలుపొందిన భారత జట్టు జూలై 4న స్వదేశానికి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో భేటీ అనంతరం జట్టు సభ్యులతో కలిసి సిరాజ్ ముంబైలో విక్టరీ పరేడ్‌లో పాల్గొన్నాడు. అదే రోజు రాత్రి వాంఖడే స్టేడియంలో బీసీసీఐ సత్కారం ముగిశాక సిరాజ్ హైదరాబాద్ బయల్దేరాడు. శుక్రవారం సాయంత్ర శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన అతడికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మెహిదీపట్నం నుంచి అతడి ఇంటివరకూ భారీ ర్యాలీ తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Mohammed Siraj’s mother is wearing the T20I World Cup medal. 🥺❤️ pic.twitter.com/6enOOKR7nV
— Johns. (@CricCrazyJohns) July 5, 2024
ఐపీఎల్లో అదరగొట్టిన సిరాజ్ తొలుత భారత టీ20 జట్టులోకి వచ్చాడు. 2017లో న్యూజిలాండ్‌పై టీ20ల్లో.. 2019లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. పేసర్‌గా నిలకడగా రాణిస్తూ జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. కెరీర్లో సిరాజ్ ఎదుగుతున్న క్రమంలోనే అతడి తండ్రి మహమ్మద్ గౌస్ (Mohammad Gous) 2021లో అనారోగ్యంతో మరణించాడు. ఆ సమయానికి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సిరాజ్ స్వదేశం వచ్చాక తండ్రికి సమాధి వద్ద నివాళులు అర్పించాడు. ఆ తర్వాత నుంచి తల్లి షబానా కొడుకుకు మద్దతుగా ఉంటూ వచ్చింది. అందుకనే సిరాజ్ తన వరల్డ్ కప్ మెడల్‌ను ఆమెకు బహుమతిగా ఇచ్చి ఖుసీ అయ్యాడు.
GOOSEBUMPS GUARANTEED…!!!
– Siraj singing Lehra Do with fans in Hyderabad, unreal welcome for Miyan. 🇮🇳 pic.twitter.com/AFwNSwSmrx
— Johns. (@CricCrazyJohns) July 5, 2024