AP News | ఏపీకి త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తెలిపారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణం కాదని.. ఏపీ మాజీ సీఎం జగనే కారణమని అన్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీతోనే ఉండి ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని వ్యాఖ్యానించారు.
తిరుమలలో గత ఐదేళ్లుగా ఇచ్చిన వీఐపీ బ్రేక్ దర్శనం వివరాలను బయటపెట్టాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. తిరుమల జూ పార్క్‌ను వడమాలపేటకు తరలించి.. ఇక్కడ టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. తిరుపతిలో క్రికెట్ స్టేడియం కోసం తాను ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి పునాది రాయి వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే తిరుపతిలోని పది ప్రాంతాల్లో పిల్లలకు ఆట స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు కార్పొరేషన్ కమిషనర్ టాప్ ప్రియారిటీ ఇవ్వాలని సూచించారు.