China Open 2024 : టెన్నిస్‌లో భావితారలుగా వెలుగొందుతున్న యువకెరటాల మధ్య ఉత్కంఠ పోరు జరుగనుంది. చైనా ఓపెన్ (China Open 2024)లో ఆద్యంత అదరగొట్టిన టాప్ సీడ్లు టైటిల్ వేటకు అడుగు దూరంలో నిలిచారు. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన జన్నిక్ సిన్నర్(Jannik Sinner), వరల్డ్ నంబర్ 2 కార్లోస్ అల్కారాజ్(Carlos Alcaraz)ల మధ్య ఉత్కంఠ పోరు అభిమానులను అలరించనుంది. సమఉజ్జీల సమరంలో విజేతగా నిలిచేది ఎవరు? అని ఫ్యాన్స్‌లో ఆసక్తి మొదలైంది.
యూఎస్ ఓపెన్ ట్రోఫీ విజయోత్సాహంతో చైనా ఓపెన్‌లో అడుగుపెట్టిన జన్నిక్ సిన్నర్ తడాఖా చూపించాడు. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థులకు చెక్ పెట్టి వచ్చిన ఇటలీ కెరటం మంగళవారం జరిగిన సెమీఫైనల్లోనూ దుమ్మురేపాడు. యున్చావోకెటె బును 6-3, 7-6(3)తో చిత్తుగా ఓడించాడు.
Jannik Sinner & Carlos Alcaraz will face each other in the final of Beijing.
The two men leading the new generation of tennis are meeting in a final for the first time this year.
Carlos leads the head to head 5-4 & he won both of their meetings in 2024.
But the last time… pic.twitter.com/f8oqC31ASu
— The Tennis Letter (@TheTennisLetter) October 1, 2024
మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో రజతంతో చరిత్రకెక్కిన అల్కరాజ్ కఠిన ప్రత్యర్థి డానిల్ మెద్వెదేవ్పై అద్భుత విజయం సాధించాడు. ఉత్కంఠ పోరులో 7-5, 6-3తో జయభేరి మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో స్పెయిన్ స్టార్‌కు ఇది ఐదో ఫైనల్ కావడం విశేషం. ఈకాలంలో మేటి ఆటగాళ్లుగా పేరొందిన సిన్నర్, అల్కారాజ్లు ఇప్పటివరకూ 9 సార్లు ఎదురుపడ్డారు. 5-4తో అల్కరాజ్ పైచేయి సాధించగా.. యూఎస్ ఓపెన్(US Open 2024) గ్రాండ్‌స్లామ్ హీరో సిన్నర్ లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఉన్నాడు. దాంతో.. బుధవారం జరుగబోయే ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.