Mongolia | బంగి : బ్యాటర్లు పరుగుల వరద పారించే పొట్టి క్రికెట్లో మంగోలియా జట్టు అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. 2026 పొట్టి ప్రపంచకప్ కోసం ఐసీసీ నిర్వహిస్తున్న ఆసియా క్వాలిఫయర్స్ టోర్నీలో భాగంగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా 10 పరుగులకే ఆలౌట్ అయింది.
సరిగ్గా 10 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఆ జట్టులో ఐదుగురు డకౌట్ అవగా మిగిలినవారిలో ఒక్కరు కూడా 2 పరుగులు చేయలేకపోయారు.