Indonasia Open : ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి నొజొమి ఒకుహర(Nozomi Okuhara)ను చిత్తుగా ఓడించి ప్రీ-క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం అదిరే ప్రదర్శనతో దూసుకెళ్లింది. అయితే.. ఫేవరెట్లుగా బరిలోకి దిగిన లక్ష్యసేన్, ప్రణయ్‌లు తీవ్రంగా నిరాశపరిచారు. పేలవ ప్రదర్శనతో ఇద్దరూ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు.
ఈ మధ్యే మలేషియా, సింగపూర్ ఓపెన్‌లో విఫలమైన సింధు ఇండోనేషియా ఓపెన్‌లో చెలరేగుతోంది. తొలి రౌండ్లోనూ కఠినమైన ప్రత్యర్థిని ఓడించింది ఒలింపిక్ విజేత. జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహరపై ఉత్కంఠ పోరులో 22-20, 21-23, 21-15తో గెలుపొందింది. నేను ఈమధ్య కాలంలో తొలి రౌండ్లోనే ఓడిపోతున్నా. సో.. ఇలాంటి ఉత్కంఠ మ్యాచుల్లో గెలుపొందడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచేది అని సింధు తెలిపింది. 16వ రౌండ్లో భారత షట్లర్ ఆరో సీడ్ పొర్న్‌పవే చౌచ్వాంగ్ (థాయ్‌లాండ్)తో తలపడనుంది.
🎬 Next Round Calling! 🇮🇳🔥
PV Sindhu battles past Nozomi Okuhara in a thrilling three-game clash, while Satwik-Chirag take down the Indonesian duo Carnando-Maulana on their home turf! 💥💪
Both advance to the Round of 16 at the Indonesia Open 2025 — the fight continues in… pic.twitter.com/kDcJDGPmFE
— BAI Media (@BAI_Media) June 3, 2025
పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ తేలిపోయాడు. స్థానిక ఆటగాడు అల్వి ఫర్హాన్(Alvi Farhan) ధాటికి చేతులెత్తేశాడు. అనంతరం జరిగిన డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిల జోడీ అదరగొట్టింది. ఇండోనేషియా జోడీ లియో రాలీ కర్నాండో, బగాస్ ని చిత్తు చేస్తూ ప్రీ- క్వార్టర్స్‌కు చేరుకుంది.