IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) పేసర్లు కైలీ జేమీసన్(3-48), అర్ష్‌దీప్ సింగ్(3-40)లు విజృంబించడంతో ఆర్సీబీ 200 లోపే పరిమితమైంది. ఆదిలోనే డేంజరస్ ఫిల్ సాల్ట్(16)ను ఔట్ చేసిన ఈ పొడగరి స్పీడ్‌స్టర్.. ఆ తర్వాత రజత్ పాటిదార్(26)ను ఔట్ చేసిబెంగళూరును దెబ్బకొట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా విరాట్ కోహ్లీ(43) కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. డెత్ ఓవర్లలో జితేశ్ శర్మ(24), రొమారియో షెపర్డ్(17)లు ధనాధన్ ఆడడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగలిగింది.
క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ ఫైనల్లో మాత్రం తడబడింది. లీగ్ ఆసాంతం చెలరేగి ఆడిన ప్రధాన బ్యాటర్లు కీలక పోరులో దంచలేకపోయారు. పంజాబ్ కింగ్స్ పేసర్లు కైలీ జేమీసన్(3-48), అర్ష్‌దీప్ సింగ్ (3-40) ధాటికి స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. రెండో ఓవర్లోనే జేమీసన్ డేంజరస్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(16)ను ఔట్ చేయగా.. విరాట్ కోహ్లీ(43) మరోసారి ఆపద్భాందవుడి పాత్ర పోషించాడు.
Innings break!
Crucial cameos galore from #RCB but #PBKS pull things back well 👏
1️⃣9️⃣1️⃣ to get and it all comes down to this!
Who will get their hands on the 🏆?
Scorecard ▶ https://t.co/U5zvVhcvdo#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile pic.twitter.com/jqFhdegMB7
— IndianPremierLeague (@IPL) June 3, 2025
సాల్ట్ ఔటయ్యాక యాంకరింగ్ రోల్ పోషించిన విరాట్.. రెండో వికెట్‌కు మయాంక్ అగర్వాల్(24)తో 38 రన్స్ జోడించాడు. దంచుతున్న మయాంక్‌ను ఊరించే బంతితో వెనక్కి పంపాడు చాహల్. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్ (26)ధనాధన్ ఆడుతూ స్కోర్ బోర్డును ఉరికించాడు. కోహ్లీతో కలిసి స్కోర్ వంద దాటించాడు. మూడో వికెట్‌కు 27 బంతుల్లోనే 40 రన్స్ రాబట్టిన పాటిదార్‌ను జేమీసన్ ఎల్బీగా ఔట్ చేసి పంజాబ్‌కు మరోసారి బ్రేకిచ్చాడు. కాసేపటికే విరాట్‌ను రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లివింగ్‌స్టోన్(25), జితేశ్ శర్మ (24)లు దూకుడుగా ఆడారు.
Unorthodox? ✅
Down the ground? ✅Jitesh Sharma is turning it on in the #Final! 💪
Updates ▶ https://t.co/U5zvVhcvdo#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @jiteshsharma_ pic.twitter.com/9JbC7ktpGX
— IndianPremierLeague (@IPL) June 3, 2025
జేమీసన్ వేసిన 17వ ఓవర్లో.. రెచ్చిపోయిన జితేశ్ మూడు సిక్సర్లతో 23 రన్స్ పిండుకున్నాడు. అతడి మెరుపులతో ఆర్సీబీ స్కోర్ 170కి చేరుకుంది. మరో మూడు ఓవర్లు ఈ ఇద్దరూ నిలబడితే 200 ప్లస్ ఖాయం అనిపించింది. కానీ, జేమీసన్ ఓవర్లో లివింగ్‌స్టోన్ ఔట్ కాగా.. ఆ తర్వాత జితేశ్‌ను విజయ్‌కుమార్ బౌల్డ్ చేసి ఆర్సీబీ భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు. అయితే.. అజ్మతుల్లా వేసిన 19వ ఓవర్లో రొమారియో షెపర్డ్(17) వరుసగా 4, 6 బాదాడు. కానీ, అర్ష్‌దీప్ చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయడంతో ఆర్సీబీ 190కే పరిమితమైంది.
A final-over spell written in fire 🔥
Arshdeep Singh pulled things back for #PBKS with 3️⃣ crucial blows ❤
Scorecard ▶ https://t.co/U5zvVhbXnQ#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @arshdeepsinghh pic.twitter.com/a7Z1i062Ug
— IndianPremierLeague (@IPL) June 3, 2025