IPL 2025 : ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పేసర్ కైలీ జేమీసన్(2-25) హడలెత్తిస్తున్నాడు. ఆదిలోనే డేంజరస్ ఫిల్ సాల్ట్(16)ను ఔట్ చేసిన ఈ పొడగరి స్పీడ్‌స్టర్.. ఆర్సీబీ సారథి రజత్ పాటిదార్(26)ను వెనక్కి పంపాడు. సిక్సర్ బాదిన అతడికి షాకిస్తూ యార్కర్ సంధించిన జేమీసన్ ఎల్బీగా వికెట్ సాధించాడు. దాంతో, 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 96 రన్స్ వద్ద బెంగళూరు మూడో వికెట్ పడింది. కీలక వికట్లు పడడంతో జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత విరాట్ కోహ్లీ(32)పై పడింది. యాంకరింగ్ రోల్ పోషిస్తున్న కోహ్లీకి అండగా లివింగ్‌స్టోన్(3) క్రీజులో ఉన్నాడు. 12 ఓవర్లకు స్కోర్.. 103-3.
ఐపీఎల్ ఫైనల్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్‌కు బిగ్ బ్రేక్ లభించింది. ఆర్సీబీ డేంజరస్ ఓపెనర్ ఫిల్ సాల్ట్()ను జేమీసన్ ఔట్ చేశాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో జోరు మీదున్న సాల్ట్‌ను ఊరించే బంతితో బోల్తా కొట్టించాడీ పేసర్. లాంగాఫ్‌లో అతడు గాల్లోకి లేపిన బంతిని గమనిస్తూ వెనక్కి పరుగెత్తిన శ్రేయాస్ అయ్యర్ ఒడుపుగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 18 వద్ద తొలి వికెట్ పడింది.
Kyle Jamieson says 🗣️ That’s how you comeback 💪
He gets the #RCB skipper with a superb pinpoint yorker 🎯@RCBTweets 102/3 after 12 overs.
Updates ▶ https://t.co/U5zvVhcvdo#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile pic.twitter.com/MGAWHMQusT
— IndianPremierLeague (@IPL) June 3, 2025
సాల్ట్ ఔటయ్యాక విరాట్ కోహ్లీ(32 నాటౌట్), మయాంక్ అగర్వాల్(24) మరో వికెట్ పడకుండా.. రన్ రేటు తగ్గకుండా చూసుకుంటూ ఆడారు. దాంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ స్కోర్ చేసింది. రెండో వికెట్‌కు 38 రన్స్ జోడించిన మయాంక్‌ను చాహల్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత రజత్ పాటిదార్(26)ధనాధన్ ఆడుతూ స్కోర్ బోర్డును ఉరికించాడు. కోహ్లీతో కలిసి స్కోర్ వంద దాటించాడు. మూడో వికెట్‌కు 27 బంతుల్లోనే 40 రన్స్ రాబట్టిన పాటిదార్‌ను జేమీసన్ ఎల్బీగా ఔట్ చేసి పంజాబ్‌కు మరోసారి బ్రేకిచ్చాడు.