Singapore Open : ప్రతిష్ఠాత్మక సింగపూర్ ఓపెనర్ సూపర్ 750లో భారత బ్యాడ్మింటన్ స్టార్లు ముందంజ వేశారు. పీవీ సింధు (PV Sindhu), హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy)లు రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల విభాగంలో దుమ్మరేపిన సింధు అరగంటలోనే కెనడా షట్లర్‌ను చిత్తు చేసింది. తనకంటే మెరుగైన ర్యాంకర్ డెన్మార్క్‌కు చెందిన రస్మస్ జెమ్కేపై ప్రణయ్ అద్భుతంగా పోరాడి విజయం సాధించాడు. అయితే.. మాళవికా బన్సోద్ , అన్మోల్ ఖార్బ్, ప్రియాన్ష్ రజావత్, కిరణ్ జార్జ్‌లు పేలవ ఆటతో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు.
మలేషియా మాస్టర్స్(Malaysia Masters)లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన పీవీ సింధు ఈసారి అదరగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో కెనాడాకు చెందిన వెన్ యూ ఝాంగ్‌పై తెలుగు తేజం అలవోకగా గెలుపొందింది. అర గంటలోనే ప్రత్యర్థిని 21-14, 21-9తో మట్టికరిపించింది సింధు. రెండో రౌండ్లో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన చెన్ యూ ఫెయా(చైనా)తో భారత షట్లర్ తలపడనుంది. గత సీజన్ నుంచి ఒక్క టైటిల్ గెలుపొందని సింధు.. సింగపూర్ ఓపెన్‌లో విజేతగా నిలవాలనే కసితో ఉంది.
#IndiaOpen2017 #Badminton🏸 PV Sindhu beats Sung Ji-hyun 21-18, 14-21, 21-14 to enter the final pic.twitter.com/quOdnUqA5e
— DD News (@DDNewslive) April 1, 2017
పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ అతికష్టమ్మీద గట్టెక్కాడు. డెన్మార్క్ షట్లర్ రస్మస్ జెమ్కేతో పోరులో తొలి సెట్ కోల్పోయిన భారత స్టార్.. ఆ తర్వాత పుంజుకున్నాడు. వరుసగా రెండు సెట్లలో పైచేయి సాధించి విజేతగా మ్యాచ్ ముగించాడు. తదుపరి రౌండ్లో ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టోవ్ పొపోవ్ను ప్రణయ్ ఎదుర్కోనున్నాడు.