తాంసి మే 27 : గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా నూతన పంచాయతీ అధికారి రమేష్ అన్నారు. నూతన పంచాయతీ అధికారిగా సోమవారం బాధ్యతలు చేపట్టగా మంగళవారం తాంసి మండలంలోని హస్నాపూర్, పొన్నారి, కప్పర్ల గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుధ్య పనులను, నర్సరీ,సెగ్రియేషన్ షెడ్,ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రికార్డులను పరిశీలించారు.
అనంతరం మండల కేంద్రానికి వచ్చిన ఆయనకు ఎంపీడీవో కార్యలయంలో పూల మొక్కను అందజేసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మోహన్ రెడ్డి, ఎంపివో రామ లింగయ్య, పంచాయతీ కార్యదర్శులు గంగన్న, కార్తిక్, సంధ్య, లావణ్య రెడ్డి, నరేష్, హమీద్, విజయ కనక దుర్గ, సుమతి తదితరులు పాల్గొన్నారు.