Shubman Gill : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టుకు కౌంట్‌డౌన్ మొదలైంది. సిరీస్ సమం చేయాలంటే గెలవడం తప్ప మరో దారి లేని పరిస్థితుల్లో భారత జట్టు ఓవల్ ఫైట్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించడంతో.. టీమిండియా ఎవరెవరితో ఆడనుంది? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill).. జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పేసర్లకు అనుకూలించే పిచ్ సిద్ధం చేసిన ఇంగ్లండ్‌కు కౌంటర్‌గా తమ లైనప్ ఉంటుందని తెలిపాడు.
ఓవల్ టెస్టుకోసం ఇంగ్లండ్ నాలుగు మార్పులు చేయగా.. కనీసం రెండు మూడు మార్పులతో భారత జట్టు ఆడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గాయం నుంచి కోలుకున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ (Arshdeep Singh) అరంగేట్రం, బుమ్రాను ఆడిస్తారా? అనేది అంతుచిక్కడం లేదు. అయితే.. సారథి గిల్ దాదాపు ఈ ఇద్దరిని ఆడించనున్నట్టు చెప్పాడు. ‘అర్ష్‌దీప్ సింగ్‌ను సిద్ధంగా ఉండాలని చెప్పాం. అతడు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమే.
అయితే.. తుది జట్టులో ఎవరిని తీసుకోవాలి అనేది పిచ్‌ను చూశాకే నిర్ణయిస్తాం. ఇంగ్లండ్ ఎంపిక చేసిన పదకొండు మందిలో ప్రధాన స్పిన్నర్ లేడు. జో రూట్, జాకబ్ బెథెల్ పార్ట్ టైమ్ స్పిన్నర్లు మాత్రమే. జడేజా, సుందర్ రూపంలో మాకు నిఖార్సైన స్పిన్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. వీళ్లిద్దరూ బ్యాటుతో, బంతితో రాణించగలరు’ అని గిల్ వెల్లడించాడు.
#WATCH | London, UK | On the heated conversation between Indian Cricket Team Head Coach Gautam Gambhir and Oval Pitch Curator Lee Fortis, Indian Team Captain Shubman Gill says, “I don’t know what exactly happened yesterday and why the pitch curator did what he did. We have played… pic.twitter.com/rn01pvHOwQ
— ANI (@ANI) July 30, 2025
బుమ్రాను ఆడిస్తారా? అనే ప్రశ్నకు మాత్రం భారత కెప్టెన్ స్పష్టత ఇవ్వలేదు. ‘బుమ్రా మా ప్రధాన పేసర్. ఓవల్ వికెట్ మీద పచ్చిక ఎక్కువ ఉంది. చూస్తుంటే పేసర్లకు అనుకూలించేలా రూపొందించారని అనిపిస్తోంది. అందుకే.. గురువారం పిచ్‌ను పరీక్షించాకే తుది జట్టును ప్రకటిస్తాం అని గిల్ వివరించాడు. అంతేకాదు ఎనిమిదో స్థానంలో సుందర్ చక్కగా సరిపోయాడని.. ఆపద్భాందవుడిలా అతడు అవతరించిన తీరు జట్టుకు ఎంతో లాభిస్తోంద’ని కెప్టెన్ తెలిపాడు. పాదం గాయంతో ఐదో టెస్టుకు దూరమైన పంత్ బదులు జగదీశన్‌ను తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. కానీ, మాంచెస్టర్ టెస్టులో విఫలమైన శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంభోజ్లపై మాత్రం వేటు పడడం ఖాయం.
భారత తుది జట్టు అంచనా : యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్ / జగదీశన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా / ఆకాశ్ దీప్, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.
What is your pace attack for the do-or-die Test match for India at The Oval starting tomorrow? 👀#Cricket #India #Test #ENGvIND pic.twitter.com/hh4xRENeTH
— Sportskeeda (@Sportskeeda) July 30, 2025