కాసిపేట : జ్వరాల నివారణకు ( Prevent fever ) ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో ( Deputy DMHO) డాక్టర్ సుధాకర్ నాయక్( Sudhakar Nayak ) సూచించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రోగుల రిజిస్టర్, ల్యాబ్, వార్డు, మెడిసిన్ స్టాక్, శానిటేషన్ పరిస్థితులను పరిశీలించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సమర్ధవంతమైన పర్యవేక్షణ, నియమిత వైద్య సేవలు, జ్వరాల నివారణ కోసం ప్రతి సిబ్బంది తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన పెంచేందుకు హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. అనంతరం మామిడిగూడ గ్రామంలో డెంగ్యూ పాజిటివ్ కేసును సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. ఇంటింటి డ్రై డే చేపట్టారు. కాలువ వద్ద టెమీఫాస్ స్ప్రే చేయించారు. సీజనల్ వ్యాధుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని శ్రీదివ్య, సీహెచ్వో వెంకటేశ్వర్లు, సూపర్వైజర్లు సరోజ, యశోద, ల్యాబ్ టెక్నిషన్ గోపి, హెల్త్ అసిస్టెంట్ నారాయణ, ఏఎన్ఎం జ్యోతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.