IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు పెద్ద షాక్. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు భారీ జరిమానా పడింది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా రూ.12 లక్షల ఫైన్ విధించింది. ఈ సీజన్లో గుజరాత్ నిర్ణీత సమయానికి ఓవర్ల్ కోటా పూర్తి చేయకపోవడం ఇదే మొదటిసారి. దాంతో, రిఫరీ ఫైన్‌తో సరిపెట్టారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచింది. అయితే.. గిల్ సేన నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. దాంతో, ఐపీఎల్ కోడ్ ఉల్లంఘన కింద గిల్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఒకవేళ రెండోసారి కూడా స్లో ఓవర్ రేటును గుర్తిస్తే ఫైన్ రెండింతలు అంటే.. రూ.24 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఇక మూడోసారి ఇదే పొరపాటు జరిగితే రూ.30 లక్షల జరిమానా.. ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది.
GT skipper Shubman Gill fined ₹12 lakh for slow over-rate vs Delhi, under Article 2.22 of IPL’s Code of Conduct. pic.twitter.com/333YWQaUsm
— CricTracker (@Cricketracker) April 20, 2025
గుజరాత్ గడ్డపై తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ సమిష్టి పోరాటంతో భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ అక్షర్ పటేల్(33), అశుతోష్ శర్మ(37)లు చెలరేగడంతో ఢిల్లీ 20 ఓవర్లకు 203 రన్స్ కొట్టింది. ఛేదనలో జోస్ బట్లర్(97) సుడిగాలిలా విరుచుకుపడ్డాడు. అతడికి షెర్ఫానీ రూథర్‌ఫర్డ్(42) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో గుజరాత్ 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. రికార్డు లక్ష్యాన్ని ఛేదించి ఐదో విక్టరీ సాధించిన గిల్ బృందం.. టేబుల్ టాపర్‌గా నిలిచింది.
🔝 of the table feeling! 💙
pic.twitter.com/PSJAWeWUrd— Gujarat Titans (@gujarat_titans) April 19, 2025