IPL 2025 : ముల్లన్‌పూర్‌లో జరుగుతున్న పోరులో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ పడింది. డేంజరస్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(22)ను కృనాల్ పాండ్యా వెనక్కి పంపాడు. పెద్ద షాట్‌కు యత్నించిన ప్రియాన్ష్ బంతిని మిడిల్ చేయలేకపోయాడు. టిమ్ డేవిడ్ అద్భుతంగా క్యాచ్ పట్టాడంతో పంజాబ్ 42 వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ప్రభ్‌సిమ్రన్ సింగ్(33), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(5)లు ఆడుతున్నారు. పవర్ ప్లేలో పంజాబ్ స్కోర్.. 62-1.
టాస్ ఓడిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(22), ప్రభ్‌సిమ్రన్ సింగ్(33)లు అదిరే ఆరంభం ఇచ్చారు. భువనేశ్వర్ వేసిన మొదటి ఓవర్లో 2 రన్స్ వచ్చినా ఆ తర్వాత దూకుడు పెంచారు. యశ్ దయాల్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ బౌండరీ బాదగా.. ప్రియాన్స్ 6, 4తో విజృంభించాడు. ఆ తర్వాత భువీని ఉతికేస్తూ ప్రభ్‌సిమ్రన్ మూడు ఫోర్లు సాధించి పంజాబ్ స్కోర్ 30 దాటించాడు. అయితే.. స్పిన్నర్ కృనాల్ పాండ్యాను రంగంలోకి దింపిన ఆర్సీబీ కెప్టెన్ ఈ జోడీని విడదీశాడు.