ముంబై: న్యూజిలాండ్(Ind Vs Nz)తో జరుగుతున్న మూడవ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, శుభమన్ గిల్ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఆ ఇద్దరూ అయిదో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా సమాచారం ప్రకారం గిల్ 58, పంత్ 50 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. కేవలం 36 బంతుల్లోనే పంత్ అర్థశతకాన్ని బాదాడు. ఇండియా 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 రన్స్ చేసింది. 72 రన్స్ తేడాతో భారత జట్టు వెనుకబడి ఉన్నది. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 235 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
Shubman Gill gets to his 7th Test half-century!
An entertaining FIFTY partnership comes 🆙 between him and Rishabh Pant 🤜🤛#TeamIndia trail by 83 runs
Live – https://t.co/KNIvTEyxU7#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/in6ILLdrzG
— BCCI (@BCCI) November 2, 2024