Shreyas Iyer : భారత స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఫస్ట్ క్లాస్ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. టెస్టు జట్టులో చోటు కోల్పోయిన అయ్యర్ ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. రెండు రోజుల క్రితమే ఇండియా డీ తరఫున దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో అర్ధ శతకంతో ఫర్వాలేదనిపించిన అతడు.. ఇరానీ కప్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. ముంబైలో ఈ స్టార్ క్రికెటర్ మరో ఇల్లు కొన్నాడు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడు.
అమ్మ రోహిణీ అయ్యర్ (Rohini Iyer)తో కలిసి అతడు ఈ ఇంటిని కొన్నట్టు స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు చెబుతున్నారు. 525 చదరపు అడుగుల విస్తీర్ణం గల అపార్ట్మెంట్ ధర రూ.2.90 కోట్లు అని సమాచారం. సెప్టెంబర్ 19వ తేదీన అయ్యర్, అతడి తల్లి పేరిట అపార్ట్మెంట్ ఖరీదు చేశాడని.. అందుకు రూ.17.40 లక్షల స్టాంప్ డ్యూటీ కట్టాని తెలుస్తోంది.
This is not the first time #ShreyasIyer is in news for real estate purchase. Iyer also owns a home in Lodha World Towers- one of the tallest buildings of #Mumbai.
Read here: https://t.co/wXeirCmqyX pic.twitter.com/c0ZvOKwuKq
— Hindustan Times (@htTweets) September 24, 2024
ముంబైలో అయ్యర్ ఖరీదైన ఇల్లు కొనడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు ముంబైలోనే అత్యంత ఎత్తైన లోధా వరల్డ్ టవర్స్ (Lodha World Towers)లోని 48వ అంతస్థులో ఓ ఫ్లాట్ కొన్నాడు. అంతేకాదు ఈ ఏడాది జూలైలో రూ.2.9 కోట్లతో వర్లీలోనే కమర్షియల్ ప్రాపర్టీని సైతం అయ్యర్ కొనుగోలు చేశాడు.
Shreyas Iyer and Shardul Thakur are set to play in the upcoming Irani Cup match between Mumbai and the Rest of India pic.twitter.com/wBLrFf58DP
— Cricbuzz (@cricbuzz) September 23, 2024
ఈ ఏడాది ఆరంభంలో బీసీసీఐ మాట పెడచెవిన పెట్టిన అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. దాంతో, మళ్లీ ఆ కాంట్రాక్ట్ కోసం అతడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే అతడు ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో బీజీగా ఉన్నాడు. దులీప్ ట్రోఫీలో అర్ధ శతకంతో చెలరేగిన అయ్యర్.. మళ్లీ ఇరానీ కప్(Irani Cup)లో ముంబై తరఫున ఆడనున్నాడు.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్, ఆపై ఆస్ట్రేలియాతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న అయ్యర్.. ఇరానీ కప్‌లో పరుగుల వరద పారించేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో అయ్యర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.