ఎన్టీఆర్(Devara) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవర. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ తరువాత దాదాపు మూడేళ్ల విరామం గ్యాప్‌తో విడుదలవుతున్న ఎన్టీఆర్(Devara) చిత్రం కావడంతో సినిమా గురించి అందరూ ఎంతో క్యూరియాసిటితో ఎదురుచూస్తున్నారు.
అయితే గతంలో కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. అనౌన్స్మెంట్లో భాగంగా సముద్రం దగ్గర అల్లు అర్జున్ నిలబడిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే చాలా మందిలో ఈ సినిమా దేవర ఆ కథతోనే తెరకెక్కిందా? అనే సందేహాలు వున్నాయి. అయితే దీనిపై కొరటాల శివ క్లారిటి ఇచ్చారు.
అల్లు అర్జున్‌తో అనుకున్న కథకు దేవరకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. దేవర కేవలం ఎన్టీఆర్ కోసమే రెడీ చేసిన సబ్జెక్ట్ (Devara) అని చెప్పారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన పలు విషయాలపై స్పందించాడు. ‘దేవర అనేది కంప్లీట్ ఫిక్షన్ స్టోరి. ఎక్కడి నుంచో ప్రేరణ పొందిన రాసిన కథ కాదు. రూటేడ్ యాక్షన్ స్టోరిగా రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా వుంటుది.
ఎన్టీఆర్ ఇచ్చిన సపోర్ట్‌తోనే ఈ రోజు దేవరను ఓ అద్భుతమైన కథగా మలిచాను. ఆయనతో వున్న స్నేహం, అనుబంధం ప్రత్యేకమైనది. నేను సక్సెస్‌లో వున్నానా? ఫెయిల్యూర్స్‌లో వున్నానా? అనేది ఆయన పట్టించుకోడు. నా విషయంలో ఆయనకు ఎటువంటి క్యాలిక్లేషన్స్ వుండవు. నా హాండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా చేశాను. దేవర అనేది ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ మాస్ ఫిలింగా నిలుస్తుంది. పార్ట్ వన్ ఎండింగ్ అందరూ రెండో భాగం గురించి ఎదురుచూసే విధంగా వుంటుంది. కథ డిమాండ్ మేరకు రెండో పార్ట్‌ను కూడా అనౌన్స్ చేశాం’ అన్నారు.