T20 World Cup 2024 : ఈసారి మహిళల టీ20 వరల్డ్ కప్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) సరికొత్తగా నిర్వహించనుంది. అందులో భాగంగానే గత సీజన్లకు భిన్నంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. మరో 9 రోజుల్లో యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా క్రీడా పండుగ ఆరంభం కానుంది. ఇప్పటికే అధికారిక పాటను విడుదల చేసిన ఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మహిళల వరల్డ్ కప్‌ను మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందున ఆడవాళ్లనే అంపైర్లు(Women Umpires)గా ఎంపిక చేసింది. మెగా టోర్నీ మ్యాచ్‌ల బాధ్యతలను పూర్తిగా మహిళలకే అప్పగిస్తూ మంగళశారం ఐసీసీ సంచలన ప్రకటన చేసింది. పొట్టి వరల్డ్ కప్ కోసం ఐసీసీ 10మందితో కూడిన మహిళా అంపైర్లను ఎంపిక చేసింది.
ముగ్గురు మ్యాచ్ రిఫరీలుగా కూడా ఆడవాళ్లనే తీసుకుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయనున్న వాళ్లలో క్లెయిర్ పొలొసాక్(Claire Polosak) అందరికంటే అనుభవజ్ఞురాలు. మరో విశేషం ఏంటంటే.. భారత్‌కు చెందిన జీఎస్ లక్ష్మీ (GS Lakshimi) మ్యాచ్ రిఫరీగా అవకాశం దక్కించుకుంది.
Officials ready 👊
An all-female panel to officiate at the Women’s #T20WorldCup 2024 ⬇#WhateverItTakeshttps://t.co/Tbywbzr2X3
— ICC (@ICC) September 24, 2024
ఆస్ట్రేలియాకు చెందిన ఆమె గతంలో నాలుగు వరల్డ్ కప్ పోటీలకు అంపైర్‌గా వ్యవహరించారు. గత వరల్డ్ కప్‌లో టీవీ అంపైర్‌గా పనిచేసిన సూ రెడ్‌ఫెర్న్ మరోసారి అదే పాత్ర పోషించనుంది. ఇక.. జింబాబ్వేకు చెందిన సారాహ్ దంబనవన తొలిసారి మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయనుంది.
వరల్డ్ కప్ అంపైర్లు : రెన్ అగెన్‌బ్యాగ్, కిమ్ కాటన్, సారాహ్ దంబనవన, అన్నా హ్యారీస్, నిమలి పెరీరా, క్లెయిర్ పొలొసాక్, వ్రిందా రథీ, సూ రెడ్‌ఫెర్న్, ఎలోసీ షెరిడాన్, జాక్విలిన్ విలియమ్స్.
మ్యాచ్ రిఫరీలు : శాంద్రే ఫ్రిట్జ్, జీఎస్ లక్ష్మి, మిచెల్ పెరీరా.
Ready to shake the ground 💥
Presenting the official ICC Women’s #T20WorldCup 2024 event song ‘Whatever It Takes’ performed by @WiSH_Official__#WhateverItTakes https://t.co/3I3TJmJndo
— ICC (@ICC) September 23, 2024
మహిళల టీ20 వరల్డ్ కప్ పోటీలకు ముందే ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. పురుషుల విభాగం మాదిరిగానే టోర్నీ విజేతలకు సమాన ప్రైజ్‌మనీ ఇస్తామని ప్రకటిచింది. అంతేకాదు వరల్డ్ కప్ ప్రచారం కోసం అధికారిక పాటను కూడా విడుదల చేసింది. ‘వాటెవర్ ఇట్ టేక్స్’ అనే టైటిల్‌తో కూడిన ఈ పాట ఏదైనా చేసేద్దాం అనే అర్థంలో సాగుతుంది. ఈ పాటలో భారత అమ్మాయిలకు చెందిన విష్(WISH) బ్యాండ్ డ్యాన్స్ స్టెప్పులతో అలరించింది. అక్టోబర్ 3న యూఏఈ వేదికగా వరల్డ్ కప్ మొదలవ్వనుంది.