Prathinidhi 2 | నారా రోహిత్ (Nara Rohit) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం ప్రతినిధి 2 (Prathinidhi 2). పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించాడు. మే 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటాం. ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా మరోసారి నిలబడితే..అంటూ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది.
చాలా రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది ప్రతినిధి 2. ఈ చిత్రం పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. మరి థియేటర్లలో ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందనేది చూడాలి. నారా రోహిత్ ప్రస్తుతం వెంకటేశ్ నిమ్మలపూడి డైరెక్ట్ చేస్తున్న సుందరకాండలో నటిస్తున్నాడు.
Prasninchenduku
Prathinidi-2 vasthunnadu!Premieres 27th September on aha!#prathinidi2 @IamRohithNara @murthyscribe @VanaraEnts @SagarMahati @kumarraja423 @TSAnjaneyulu1 #aha pic.twitter.com/VO2XdzwXTl
— ahavideoin (@ahavideoIN) September 23, 2024
Koratala Siva | నాకు మొదట మెసేజ్ చేసింది చిరంజీవి.. నెట్టింట ట్రోల్స్‌పై కొరటాల శివ క్లారిటీ
Pawan Kalyan vs Prakash Raj | అర్థం కాకపోతే మళ్లీ చదువుకో.. పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Rathnavelu | దేవరలో జాన్వీకపూర్ కనిపించేది అప్పుడేనట.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Jr NTR | దేవర క్రేజ్.. తొలి భారతీయ హీరోగా తారక్ అరుదైన ఫీట్