Prakash Raj | తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (pawan kalyan) పేరు ప్రస్తావిస్తూ మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్నరాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. దీనిపై విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి.. మీరెందుకు అనవసర భయాలు కల్పించి.. ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉత్రిక్తతలు చాలు.. కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ట్వీట్‌పై స్పందిస్తూ.. ఈ విషయానికి ప్రకాశ్ రాజ్‌కు సంబంధమేంటని పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు.
#AndhraPradesh —-#WATCH– Deputy CM Pawan Kalyan reacts to the statement by Actor Prakash Raj over use of adulterated ghee in the ‘laddu prasadam’ of the famous Tirumala Tirupati Devasthanam.
A war of words began between the actor and @APDeputyCMO.
In a recent post, Prakash… pic.twitter.com/SJuWjBNSEp
— NewsMeter (@NewsMeter_In) September 24, 2024
ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ స్పందించాడు. నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ ఉన్నా. మీకు వీలైతే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పిందేంటి.. మీరు అపార్థం చేసుకొని చెబుతున్నదేమిటి. ఈ నెల 30న వచ్చి మీ ప్రతీ మాటకు సమాధానం చెబుతానన్నాడు ప్రకాశ్ రాజ్. అంతకుముందు పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయానికి ప్రకాశ్ రాజ్‌కు సంబంధమేంటి. నేను మాట్లాడుతుంది హిందువులు.. జరుగుతున్న అపవిత్రత గురించి.. ఇందులో ప్రకాశ్ రాజ్ గారికి సంబంధమేంటి. నేను ఇంకో మతాన్ని నిందించానా..? అపవిత్రం జరిగిందని మాట్లాడకూడదా..? పిచ్చి పట్టిందా.. మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు.
ప్రకాశ్ రాజ్‌కు కూడా చెబుతున్నా. మీరంటే నాకు చాలా గౌరవం. సెక్యులరిజంకు వెల్కమ్ ప్రకాశ్ రాజ్. మీ సెక్యులరిజం వన్ వే కాదు.. టూ వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్పా.. అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయంలో శుద్దికార్యక్రమం నిర్వహించారు పవన్ కల్యాణ్. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పవన్ కల్యాణ్ ఆలయం వద్ద మెట్లను శుభ్రం చేసి.. మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు.
Dear @PawanKalyan garu..i saw your press meet.. what i have said and what you have misinterpreted is surprising.. im shooting abroad. Will come back to reply your questions.. meanwhile i would appreciate if you can go through my tweet earlier and understand #justasking pic.twitter.com/zP3Z5EfqDa
— Prakash Raj (@prakashraaj) September 24, 2024
Rathnavelu | దేవరలో జాన్వీకపూర్ కనిపించేది అప్పుడేనట.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Jr NTR | దేవర క్రేజ్.. తొలి భారతీయ హీరోగా తారక్ అరుదైన ఫీట్
Game Changer | ఎస్ థమన్ గేమ్ ఛేంజర్ థ్రిల్లింగ్ అనౌన్స్మెంట్ ఏంటో మరి..?