Siddu Jonnalagadda | డీజే టిల్లు (DJ Tillu) తో సూపర్ స్టార్డమ్ సంపాదించిన సిద్ధు జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌తో సినిమా చేస్తున్నాడు. SVCC 37గా వస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే షురూ అయింది. సిద్ధుకు బర్త్ డే విషెస్ చెబుతూ జాక్ (Jack) టైటిల్‌ను ప్రకటిస్తూ.. పోస్టర్ కూడా విడుదల చేశారు. పోస్టర్లో సిద్ధు గన్స్ పట్టుకుని ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. జాక్ షూటింగ్ దశలో ఉంది.
కాగా మూవీ సెట్స్‌లో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సిద్దు అండ్ టీం డైరెక్టర్‌తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య, ప్రకాశ్‌రాజ్, నిర్మాతతోపాటు పలువురు యూనిట్ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. జాక్ సినిమా షూటింగ్ నేపాల్‌లో జరుగుతుంది. దీనికి సంబంధించిన స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
సిద్దు జొన్నల గడ్డ ప్రస్తుతం నీరజ కోన డైరెక్షన్లో తెలుసు కదా సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ కూడా చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు టిల్లు 3 కూడా లైన్లో పెట్టాడు. త్రీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది.
The Highly striking #JACK Motion poster is here to enthrall you ❤️🔥https://t.co/DgNpVjXsU8
Entire Team wishes the star boy #SidduJonnalagadda a rocking birthday 💫#HBDSidduJonnalagadda#SVCC37 @iamvaishnavi04@baskifilmz @SVCCofficial pic.twitter.com/aJ8DYNNMID
— BA Raju’s Team (@baraju_SuperHit) February 7, 2024
Team #Jack celebrates Director #BommarilluBhaskar’s birthday on sets today ❤️🔥❤️🔥
He’s coming back with yet another wild story that will keep you on the edge of your seat! 💥💥 #SidduJonnalagadda@iamvaishnavi04@baskifilmz @SVCCofficial #SVCC37 pic.twitter.com/0GzObdjHpB
— BA Raju’s Team (@baraju_SuperHit) September 23, 2024
Jani Master | జానీమాస్టర్‌ను కస్టడీకి కోరిన నార్సింగి పోలీసులు..!
Chiranjeevi | నా డ్యాన్స్‌లను ఇష్టపడిన ప్రతీ ఒక్కరికి అంకితం : గిన్నీస్ రికార్డ్‌పై చిరంజీవి
Priyanka Jawalkar | ట్రిప్‌లో స్టైలిష్‌గా ప్రియాంకా జవాల్కర్.. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Chiranjeevi | గిన్నీస్ రికార్డ్.. Most Prolific Film Star అవార్డు అందుకున్న చిరంజీవి