Game Changer | రాంచరణ్ (Ram Charan) వరుస సినిమాలతో అభిమానులను ఎంటర్టైన్ చేసే పనిలో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్ యాక్టర్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు సుందరి అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం మ్యూజిక్ డైరక్టర్ ఎస్ థమన్ ఏదో ఒక వార్తను షేర్ చేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా సెప్టెంబర్ 25న అనౌన్స్మెంట్ అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ అదేంటో చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టి సినిమాపై క్యూరియాసిటీ పెంచడమే కాదు.. అది ఖచ్చితంగా అభిమానులను థ్రిల్ చేయడం మాత్రం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్. ఇది సెకండ్ సింగిల్ గురించే అయి ఉంటుందని అంతా అనుకుంటుండగా.. అదేంటనేది రేపు క్లారిటీ రానుందన్నమాట.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సందడి చేయనున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో కథానుగుణంగా రాంచరణ్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
25th September ANNOUNCEMENT 💪🏾#GameChanger 🔥
Dec20th 2024 RELEASE 🧨🏆
— thaman S (@MusicThaman) September 23, 2024
Jr NTR | దేవర క్రేజ్.. తొలి భారతీయ హీరోగా తారక్ అరుదైన ఫీట్