Koratala Siva | ఎవరు చేయాల్సిన పని వారు భయంతో, అటెన్షన్‌తో చేస్తే అంతా బాగానే ఉంటుంది. కానీ పక్కవాళ్లు చేస్తున్న పనిలో వేలు పెట్టి.. వాళ్ల పని వాళ్లు చేసుకోనివ్వకపోతేనే నష్టం అంటూ కొరటాల శివ (Koratala Siva) దేవర ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడని తెలిసిందే. అయితే కొరటాల కామెంట్స్ ఆచార్య సినిమానుద్దేశించినవేనని.. పరోక్షంగా చిరంజీవి (Chiranjeevi)ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడంటూ నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుండగా.. వాటిపై క్లారిటీ ఇచ్చాడు కొరటాల శివ.
తాజాగా దేవర ప్రమోషనల్ చిట్‌చాట్‌లో కొరటాల మాట్లాడుతూ.. ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత మానసికంగా కృంగిపోయాను. నువ్వు ఖచ్చితంగా మంచి కమ్‌బ్యాక్ ఇస్తావ్ శివ అని నాకు మొట్టమొదటిసారి మెసేజ్ చేసింది చిరంజీవి. ఆచార్య ఈవెంట్ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఒక్క సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచినంత మాత్రాన మా మధ్య పగలు, ప్రతీకారాల్లాంటివి ఏమీ లేవు. అదంతా బయటివాళ్లు సృష్టించుకున్నదేనని క్లారిటీ ఇచ్చాడు. ఈ కామెంట్స్‌తో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు కొరటాల.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో జోష్ మీదున్న కొరటాల శివ చిరంజీవి టైటిల్ రోల్లో ఆచార్య తెరకెక్కించాడని తెలిసిందే. రాంచరణ్, చిరు కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూ తాను చేసిన కామెంట్స్‌ను వక్రీకరించి.. చిరంజీవి జోక్యం వల్లే ఆచార్య ఫ్లాప్ అయ్యిందంటూ ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లకు కొరటాల శివ స్పష్టత ఇచ్చాడు .
కొరటాల ముందుగా ఆచార్య సినిమాను రాంచరణ్‌తో తీయాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే సినిమా మొదలయ్యే సమయానికి రాంచరణ్‌తో కాకుండా తనతో చేయాలని కొరటాలను తానే కోరినట్టు చిరంజీవి ప్రకటించాడు. ఇదిలా ఉంటే మరోవైపు చిరంజీవి ఎలా చెబితే అలా చేశానని,, ఈ సినిమాకు ఆయనే అసలు డైరెక్టర్ అని అన్నాడు కొరటాల. దీంతో ముందుగా నవ్విన చిరంజీవి.. అయితే సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మాత్రం అది డైరెక్టర్ ఛాయిస్. ఆయన ఏం చెబితే అదే చేశానని కామెంట్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
Rathnavelu | దేవరలో జాన్వీకపూర్ కనిపించేది అప్పుడేనట.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Jr NTR | దేవర క్రేజ్.. తొలి భారతీయ హీరోగా తారక్ అరుదైన ఫీట్
Game Changer | ఎస్ థమన్ గేమ్ ఛేంజర్ థ్రిల్లింగ్ అనౌన్స్మెంట్ ఏంటో మరి..?