Shreyas Iyer : ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తనను తొలగించిన బీసీసీఐ (BCCI) కి శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఓ క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) లో అద్భుత సెంచరీ ద్వారా ఈ మెసేజ్ పంపాడు. ముంబై జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన అయ్యర్.. కేవలం 50 బంతుల్లో సెంచరీ బాది తన జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు. గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad) లోని నరేంద్రమోదీ స్టేడియం (Narendra Modi Stadium) లో కర్ణాటక జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ ఈ ఘనత సాధించాడు.
కర్ణాటకతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఏడు పరుగుల వద్ద వికెట్ పడింది. అయితే రెండో వికెట్‌కు ఆయుష్ మాత్రే (78), హార్దిక్ తమోర్ (84) 141 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి ముంబైకి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (114).. శివమ్ దూబే (63) తో కలిసి 148 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. దూబే 36 బంతుల్లో ఐదు సిక్సులు, ఐదు ఫోర్లతో 63 పరుగులు చేయగా, అయ్యర్ 55 బంతుల్లో 10 సిక్సర్లతో 114 పరుగుల రాబట్టాడు. 50 బంతులకే సెంచరీ పూర్తిచేశాడు.
చాంపియన్స్ ట్రోఫీకి ముందు అయ్యర్ అద్భుత ప్రదర్శన బీసీసీఐకి క్లియర్ మెసేజ్‌గా చెప్పవచ్చు. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో తనకు చోటు కల్పించాలని బీసీసీఐకి అయ్యర్ స్పష్టంగా సందేశం పంపినట్లయ్యింది. ఇదిలావుంటే ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ శ్రేయాస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.