Shikhar Dhawan : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్ (Shikhar Dhawan) రెండు రోజులకే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఇకపై లెజెండ్స్ లీగ్ క్రికెట్(Legneds League Cricket)లో దంచికొట్టేందుకు సిద్దమవుతున్నానని తెలిపాడు. ఇంటర్నేషనల్, దేశవాలీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన గబ్బర్ లెజెండ్స్ లీగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. సోమవారం ధావన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.
‘రిటైర్మెంట్ తర్వాత లెజెండ్స్ లీగ్ క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలెట్టడం చాలా గొప్ప నిర్ణయం అనిపిస్తోంది. ఆటకు తగ్గట్టుకు నా శరీరం కండిషన్లోనే ఉంది. నా నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నాను. క్రికెట్ అనేది నాలో అందర్భాగం. ఆ ఆట నా నుంచి ఎప్పుడూ దూరం వెళ్లదు. నాతో ఒకప్పుడు క్రికెట్ ఆడిన స్నేహితులతో కలిసి మళ్లీ పరుగుల వరద పారించేందుకు ఉత్సాహంగా ఉన్నాను. అభిమానులను ఉల్లాసపరచడమే కాకుండా కొత్త జ్ఞాపకాలను పోగు చేసుకునేందుకు సిద్దమవుతున్నా’ అని ధావన్ తెలిపాడు.
రోహిత్ శర్మకు జోడీగా ధావన్ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2012 నుంచి 2021 మధ్య 115 ఇన్నింగ్స్‌లో 5,148 పరుగులు జోడించాడు. అయితే.. శుభ్‌మన్ గిల్(Shubman Gill) దూసుకు రావడంతో అతడి స్థానానికి ఎసరొచ్చింది. స్వదేశంలో శ్రీలకం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లలో గిల్, రోహిత్ ద్వయం బాగా హిట్ అయింది. దాంతో, ఇక ధావన్ అవసరం లేకపోయింది.
Shikhar Dhawan and Rohit Sharma, an opening pair like no other. 💙
➡️ https://t.co/OkzNVezz6P pic.twitter.com/u2qBvq6dTY
— Wisden India (@WisdenIndia) August 24, 2024
ఓపెనర్‌గా రోహిత్‌తో పాటు గిల్, ఇషాన్ కిషన్(Ishan Kishan), యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) రూపంలో చాలా ఆప్షన్లు ఉన్నాయి. దాంతో, ప్రపంచ కప్ (ODI World Cup 2023) జట్టులోనూ ధావన్ ఉండే అవకాశం లేదు. అయితే.. ఈ లెఫ్ట్ హ్యాండర్ మాత్రం ఏదో ఒకరోజు చాన్స్ రాకపోతుందా? అనే నమ్మకం వ్యక్తం చేసేవాడు. మైదానంలో తన సూపర్ ఆటతో అదరగొట్టిన ధావన్ వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు.
అతడు అయేషా ముఖర్జీని 2012 అక్టోబర్‌లో పెండ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు మొదటి భర్తతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. 9 ఏండ్ల తర్వాత దాంపత్య జీవితం తర్వాత ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. 2021లో అయేషా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధావన్‌తో విడాకుల విషయాన్ని వెల్లడించింది. ఈమధ్యే ఫ్యామిలీ కోర్టు ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం అయేషా ఆస్ట్రేలియాలో ఉంటోంది. జొరావర్ కూడా ఆమెతో పాటు అక్కడే ఉంటున్నాడు.