TG Rains | ఈ నెల 29 నాటికి తూర్పు మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉందని.. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని పేర్కొంది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
27న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. 28న ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 29, 30 తేదీల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
Harish Rao | కాంగ్రెస్ పాలనలో తాగునీటి కష్టాలు.. మండిపడ్డ హరీశ్‌రావు
Yadadri | రేపు యాదాద్రికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు