Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో తాగునీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మేడికుందా తండాలో గత 15 రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. కాలి నడకన వెళ్లి కుంట నుండి బిందెలో నీళ్లు మోసుకొచ్చుకుంటున్నారు. కలుషిత నీళ్ళు తాగటం వల్ల విషజ్వరాలు వచ్చి ఆస్పత్రి పాలవుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని అధికారులను వేడుకున్నా స్పందించడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు.
ఈ తాగునీటి కష్టాలపై సంగారెడ్డి కలెక్టర్ తక్షణమే స్పందించాలని హరీశ్‌రావు సూచించారు. మేడికుందా తండా వాసులకు అవసరమైన తాగునీటిని అందించాలని, ఇందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. సురక్షిత మంచినీటిని అందించకపోతే ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు.
కాంగ్రెస్ వచ్చింది. రాష్ట్రంలో తాగు నీటి కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి.
సంగారెడ్డి – వట్ పల్లి మండలం మేడికుందా తండాలో 15 రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాలి నడకన వెళ్లి కుంట నుండి బిందెలో నీళ్లు మోసుకొచ్చుకుంటున్నారు. కలుషిత నీళ్ళు… pic.twitter.com/zdgZlt42qa
— Harish Rao Thanneeru (@BRSHarish) August 26, 2024
ఇవి కూడా చదవండి..
Yadadri | రేపు యాదాద్రికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ..!