AIMIM MP : కులగణనపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని తాము పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఇంతవరకూ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. 2010లో పీ చిదంబరం నిర్వహించిన సామాజిక సర్వే నివేదికను మోదీ ప్రభుత్వం దేశ ప్రజల ముందుంచాలని ఓవైసీ డిమాండ్ చేశారు.
ఈ నివేదికను ఎందుకు తొక్కిపెడుతున్నారని ఆయన నిలదీశారు. జనగణన నిర్వహించకుండా అడ్డుపడుతున్నదెవరని అసదుద్దీన్ ఓవైసీ నిలదీశారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాటించాల్సిన అవసరం లేదని అన్నారు. పార్లమెంట్లో ఈ దిశగా బిల్లు ప్రవేశపెడితే తామంతా మద్దతు పలుకుతామని చెప్పారు.
కాగా, జనగణనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల పట్ల ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా అభ్యంతరం వ్యక్తం చేశారు. 2021 నుంచి ఎలాంటి జన గణన నిర్వహించలేదు.. జనగణన చేపట్టకపోవడం దేశంలో ఇదే తొలిసారి దీన్ని ఎందుకు నిలిపివేశారని ఆయన ప్రశ్నించారు. ఇంత పెద్ద దేశంలో సంక్లిష్ట సమయాల్లోనూ జనగణనను ఆపలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై రేపు విచారణ..!