Bangladesh T20 Squad : శ్రీలంక గడ్డపై టెస్టు, వన్డే సిరీస్ కోల్పోయిన బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల పొట్టి సిరీస్ కోసం శుక్రవారం 16 మందితో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు. లిటన్ దాస్ (Litton Das) కెప్టెన్‌గా బీసీబీ ప్రకటించిన జట్టులో సీనియర్ ప్లేయర్, మాజీ నాయకుడికి చోటు దక్కలేదు. ఈమధ్యే టెస్టు సారథిగా వైదొలిగిన నజ్ముల్ హుసేన్ శాంటో(Najmul Hussain Shanto)ను సెలెక్టర్లు పక్కన పెట్టేశారు.
అయితే.. ఆల్‌రౌండర్ సైఫుద్దీన్ ఏడాది విరామం తర్వాత పొట్టి క్రికెట్ స్క్వాడ్‌లోకి వచ్చాడు. పేస్ త్రయం తస్కిన్, ముస్తాఫిజుర్, నసుమ్ అహ్మద్‌లు చోటు నిలబెట్టుకున్నారు. ఇరుజట్ల మధ్య జూలై 10 నుంచి జూలై 16 వరకూ టీ20 సిరీస్ జరుగనుంది.
బంగ్లాదేశ్ టీ20 స్క్వాడ్ : లిటన్ దాస్(కెప్టెన్), తంజిద్ హసన్, పర్వేజ్ హొసేన్, మహ్మద్ నైమ్, తౌహిద్ హృదయ్, జకీర్ అలీ, షమీమ్ హొసేన్, హెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొసేన్, షక్ మెహెదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, షొరిఫుల్ ఇస్లాం. తంజిమ్ హసన్, మహ్మద్ సైఫుద్దీన్.