IND vs ENG : టీ సెషన్ తర్వాత ఆకాశ్ దీప్ భారత్‌కు బ్రేకిచ్చాడు. రెండో కొత్త బంతితో మ్యాజిక్ చేసిన ఆకాశ్ క్రీజులో పాతుకుపోయిన హ్యారీ బ్రూక్ (158)ను బౌల్డ్ చేశాడు. దాంతో, ఆరో వికెట్‌కు 303 పరగులు రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది. అంతకుముందు ఓవర్లోనే ఇబ్బంది పడిన బ్రూక్.. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని ఆడగా అది ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది. దాంతో, భారత ఆటగాళ్ల ముఖంలో సంతోషం నిండింది. ప్రస్తుతం జేమీ స్మిత్(170), క్రిస్ వోక్స్ క్రీజులో ఉన్నారు. బ్రూక్ ఔటయ్యేసరికి ఇంగ్లండ్ స్కోర్ 387. ఇంకా ఆతిథ్య జట్టు 200 రన్స్ వెనకబడి ఉంది.
ఎడ్జ్‌బాస్టన్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు రోజులు టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తే.. మూడోరోజు ఇంగ్లండ్ బ్యాటర్లు జోరు చూపిస్తున్నారు. తొలి సెషన్లో సిరాజ్ విజృంభణతో రూట్, బెన్ స్టోక్స్ ఔటయ్యారు. 85కే సగం వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు అనూహ్యంగా భారీ స్కోర్ చేసింది. భారత పేసర్లను ఎదుర్కోలేక స్టార్ ఆటగాళ్లు పెవిలియన్ చేరినా కుర్రాళ్లు మాత్రం మొక్కవోని పట్టుదలతో క్రీజులో నిలిచారు.
TIMBER!
A much-needed breakthrough for #TeamIndia! 👏
Akash Deep strikes to dismiss Harry Brook! 👍
Updates ▶️ https://t.co/Oxhg97fwM7#ENGvIND pic.twitter.com/e5QYOM4SRF
— BCCI (@BCCI) July 4, 2025
పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో హ్యారీ బ్రూక్(158), వికెట్ కీపర్ జేమీ స్మిత్(172 నాటౌట్) బజ్ బాల్ ఆటతో చెలరేగిపోయారు. లీడ్స్‌లో ధనాధన్ ఆడిన ఈ ఇద్దరూ మరోసారి ఆతిథ్య జట్టుకు ఆపద్భాందవులయ్యారు. ఆరో వికెట్‌కు కేవలం 303 పరుగులతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. వీరిద్దరి మెరుపులతో వికెట్ల పతనానికి బ్రేక్ పడగా.. లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 249 రన్స్ చేసింది. టీ సెషన్ తర్వాత బ్రూక్ సెంచరీ సాధించగా.. స్మిత్ 150 క్లబ్లో చేరాడు.