Shakib Al Hasan : ప్రపంచంలోని గొప్ప ఆల్రౌండర్లలో ఒకడైన షకీబుల్ హసన్ (Shakib Al Hasan)కు సొంత బోర్డు షాకిచ్చింది. స్వదేశంలో ఆఖరి టెస్టు ఆడి సగర్వంగా వీడ్కోలు పలకాలనుకున్న అతడికి జట్టులో చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు కోసం షకీబ్ స్థానంలో యువ స్పిన్నర్‌ను బంగ్లాదేశ్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. సఫారీలతో మిర్పూర్ టెస్టు కోసం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హసన్ మురాద్ (Hasan Murad)ను తీసుకుంటున్నట్టు బంగ్లా క్రికెట్ బోర్డు ప్రకటించింది. దాంతో, ఫేర్వెల్ టెస్టుపై ఆశలు పెట్టుకున్న దిగ్గజ ఆల్‌రౌండర్ కల చెదిరేలా ఉంది.
భారత పర్యటనలోనే వీడ్కోలు నిర్ణయం వెల్లడించిన షకీబ్ స్వదేశంలో ఆఖరి టెస్టు ఆడాలని ఉందని మనసులోని మాట చెప్పాడు. అయితే.. తనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానిదే అని డిమాండ్ చేసిన షకీబ్.. రెండు నెలల క్రితం బంగ్లాలో అల్లర్లు చెలరేగిన సమయంలో మౌనంగా ఉన్నందుకు దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాడు కూడా.
Hasan Murad replaces Shakib Al Hasan#BANvSA #PranPotata pic.twitter.com/k3O3rBosEt
— bdcrictime.com (@BDCricTime) October 18, 2024
అయినా సరే సెలెక్టర్లు అతడి పేరును తొలి టెస్టుకు పరిగణనలోకి తీసుకోలేదు. అందువల్ల ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న షకీబ్ స్వదేశం వెళ్లలేదు. ‘నేను తర్వాత ఎక్కడికి వెళ్తానో తెలియదు. అయితే.. కచ్చితంగా మా దేశానికి మాత్రం పోను’ అని షకీబ్ తెలిపాడు.
🚨 Hasan Murad is replacing Shakib Al Hasan in the First Test against South Africa.
Good replacement?? What do you think? pic.twitter.com/QOzF7hcjgE
— Saif Ahmed (@saifahmed75) October 18, 2024
‘తొలి టెస్టుకు షకీబ్ అందుబాటులో ఉండడం లేదు. అయితే.. అతడు టెస్టు కెరీర్లో చివరి అంకంలో ఉన్నాడు. అనుభవజ్ఞుడైన షకీబ్ బ్యాటుతో, బంతితో చెలరేగగలడు. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు అయితే ఇప్పటికి లేడు. అయితే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో హసన్ మురాద్ నిలకడగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా స్వదేశంలో అతడు బౌలింగ్ బాగా చేస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై ఈ యువకెరటం రాణిస్తాడని ఆశిస్తున్నాం’ అని బంగ్లా క్రికెట్ బోర్డు జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఘాజీ అష్రఫ్ హొసేన్ వెల్లడించాడు.
తొలి టెస్టుకు బంగ్లాదేశ్ స్క్వాడ్ : నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, జకీర్ హసన్, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్(వికెట్ కీపర్), జకీర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీం హసన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్ముద్, నిషద్ రానా, హసన్ మురాద్.