అమరావతి : ప్రేమ వివాహానికి యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలుపడంతో ప్రేమ జంట ఆత్మహత్య (Lovers Suicide) చేసుకున్న విషాద ఘటన గుంటూరు జిల్లాలో (Guntur district) చోటు చేసుకుంది. జిల్లాలోని పెదకాకాని గ్రామానికి చెందిన దానబోయిన మహేశ్(22), నందిగామ మండం రుద్రవరానికి చెందిన శైలు(21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని యువకుడి కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించగా, యువతి తరుపు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో దసరా సమయంలో ఇద్దరు ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. శుక్రవారం పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతుల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.