Shakib Al Hasan : బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్(Shakib Al Hasan) వివాదంలోనూ అద్భుతంగా రాణించాడు. హత్య కేసు(Murder Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీబ్ రావల్పిండి టెస్టు(Rawalpindi Test)లో చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కనబరిచాడు. పాకిస్థాన్(Pakistan)పై బంగ్లాదేశ్ చిరస్మరణీయ విజయంలో భాగయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన షకీబ్ న్యూజిలాండ్ దిగ్గజం డానియెల్ వెటోరీ (Daniel Vettori) రికార్డు బద్ధలు కొట్టేశాడు.
అంతర్జాతీయ క్రికెట్లో 707 వికెట్లతో వెటీరీని షకీబ్ అధిగమించాడు. కివీస్ వెటరన్ ఖాతాలో 705 వికెట్లు ఉన్నాయి. షకీబ్ ఇప్పటివరకూ టెస్టుల్లో 241, వన్డేల్లో 317, టీ20ల్లో 149 వికెట్లు పడగొట్టాడు. రావల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. డ్రా ఖావడం పక్కా అనుకున్న మ్యాచ్‌లో అనూహ్య విజయంతో నజ్ముల్ హుసేన్ శాంటో సేన పాకిస్థాన్(Pakistan)కు షాకిచ్చింది. దాంతో, పాక్‌పై టెస్టుల్లో తొలి విజయం నమోదు చేసింది.
Shakib Al Hasan went past Daniel Vettori to become the leading wicket-taker among left-arm spinners 🌀
Full list: https://t.co/f8kW7n3Q2J | #PAKvBAN pic.twitter.com/gpZoom1nt0
— ESPNcricinfo (@ESPNcricinfo) August 25, 2024
ఆద్యంతం ఉత్కంఠ రేపిన రావల్పిండి టెస్టులో బంగ్లా 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ముష్ఫికర్ రహీమ్(191) సూపర్ సెంచరీకి.. మెహిదీ హసన్ మిరాజ్(77, 4/21), షకీబుల్ హసన్(3/44) ఆల్‌రౌండ్ షో తోడవ్వడంతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు.
What a way to register a historic win!
Test looked primed for a draw on a docile track and then Bangladesh decide to shake things up on Day 5 to inflict a huge defeat – first 10-wicket loss at home for Pakistan https://t.co/xz4BFLQVGD | #PAKvBAN pic.twitter.com/SQeqLh0CSK
— ESPNcricinfo (@ESPNcricinfo) August 25, 2024
మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కొట్టిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 140 రన్స్‌కే కుప్పకూలింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(37)ను ఔట్ చేసిన షకీబ్ ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ సెంచరీ వీరుడు సాద్ షకీల్(0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. మరో ఎండ్‌లో మిరాజ్ నిప్పులు చెరగగా పాక్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన పర్యాటక జట్టు పాకిస్థాన్ గడ్డపై మరే జట్టుకు సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.