అమరావతి : శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservaior) వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గాయి. సుంకేసుల, జూరాల (Jurala) నుంచి వరద నీరు వచ్చి చేరడంతో జలాశయానికి 45,855 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,882 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కువిడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను , ప్రస్తుతం 884. 10 అడుగుల వరకు నీరు నిలువ ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు ప్రస్తుతం 210.5130 టీఎంసీల నీటి నిలువ ఉంది.
Nagarjuna Sagar | నిండు కుండలా నాగార్జునసాగర్.. గేట్ల పైనుంచి దూకుతున్న కృష్ణమ్మ.. వీడియో