Crime news | పూటుగా మద్యం తాగివచ్చి గొడవ.. భర్త మర్మాంగాన్ని కోసేసిన రెండో భార్య..!
Crime news | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త పెట్టే వేధింపులకు భరించలేక అతని రెండో భార్య.. భర్త మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భర్తని ఒంగోలు నగరంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Crime news : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త పెట్టే వేధింపులకు భరించలేక అతని రెండో భార్య.. భర్త మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భర్తని ఒంగోలు నగరంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన విజయ్ యాదవ్ గతకొద్ది కాలంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో ఓ పశువుల డైరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే డైరీ ఫామ్ లో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన సీతా కుమారి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విజయ్ యాదవ్‌కు ఇదివరకే వివాహం కాగా అతడి భార్య బీహార్‌లోని సొంత ఊరిలోనే ఉంది. సీతతో వివాహేతర సంబంధం కొనసాగించి రెండో పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి చేసుకున్న తర్వాత సీత గర్భం దాల్చింది. గర్భవతి అయిన తర్వాత విజయ్ ఆమెను పట్టించుకోవడం లేదన్న కారణంగా తరచూ అతనితో గొడవపడేది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి సమయంలో మద్యం తాగి వచ్చిన విజయ్ యాదవ్‌కు సీతాకుమారికి మద్య గొడవ జరిగింది. దీంతో రెండో భార్య సహనం కోల్పోయి కత్తితో భర్తపై దాడి చేసింది. ఈ దాడిలో భర్త మర్మాంగాన్ని భార్య కోసేసింది. కానీ దాడిలో తీవ్రంగా గాయపడ్డ భర్తని చూసి భయంతో డైరీ ఫార్మ్ యాజమానికి ఫోన్ చేసి విషయం చెప్పింది.
డైరీ ఫామ్ యజమాని వచ్చేలోపే అక్కడ నుంచి ఆమె పరారైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న భార్య సీతా కుమారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

