ఢిల్లీ: వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనున్న భారత మహిళల జట్టులో యువ ఓపెనర్ షఫాలీ వర్మ చోటు కోల్పోయింది. ఈ ఏడాది వన్డేలలో పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్న షఫాలీపై సెలక్టర్లు వేటు వేశారు. 2024లో ఆడిన 6 వన్డేలలో షఫాలీ 108 పరుగులు మాత్రమే చేసింది. ఆమెతో పాటు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడిన జట్టులోని ఉమా, హేమలత, శ్రేయాంక, సయాలికి సైతం సెలక్టర్లు షాకిచ్చారు.