Zimbabwe : జింబాబ్వే టెస్టు జట్టులోకి సీనియర్లు వచ్చేశారు. బంగ్లాదేశ్ పర్యటన(Bangladesh Tour)లో రెండు టెస్ట్ సిరీస్ కోసం క్రెగ్ ఎర్విన్, సియన్ విలియమ్స్‌లను స్క్వాడ్‌కు ఎంపిక చేశారు సెలెక్టర్లు. చివరిసారిగా ఫిబ్రవరిలో ఐర్లాండ్‌తో ఆడిన వీళ్లిద్దరు మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్లో ఆడబోతున్నారు. ఇక వికెట్ కీపర్, బ్యాటర్ అయిన తఫద్జాకు రెండేళ్ల తర్వాత పిలుపు వచ్చింది. అయితే.. టాపార్డర్ బ్యాటర్ తకుడ్వనషెను సెలెక్టర్లు పక్కన పెట్టేశారు.
దాదాపు నాలుగేళ్ల తర్వాత జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లుతోంది. 2020 ఫిబ్రవరిలో బంగ్లా గడ్డపై అడుగుపెట్టిన ఆఫ్రికా జట్టు ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఏప్రిల్ 20న జింబాబ్వే, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. అనంతరం ఛత్తోగ్రామ్‌లో ఏప్రిల్ 28న రెండో మ్యాచ్ నిర్వహించనున్నారు.
Captain Craig Ervine and allrounder Sean Williams return for Zimbabwe’s upcoming two-match Test series in Bangladesh 🇿🇼 pic.twitter.com/iZtbFy8A8H
— ESPNcricinfo (@ESPNcricinfo) April 7, 2025
జింబాబ్వే స్క్వాడ్ : క్రెగ్ ఎర్విన్(కెప్టెన్), జొనాథన్ క్యాంప్‌బెల్, బెన్ కర్రాన్, ట్రెవొర్ వాండు, వెస్లీ మధీవెర, వెల్లింగ్టన్ మసకజ్జ, విన్సెంట్ మసెకెస, నైశా మయవొ, బ్లెస్సింగ్ ముజరబని, రిచర్డ్ గరవ, విక్టర్ న్యాచి, తఫద్జ్వ సిగా, నికోలస్ వెల్చ్, సియన్ విలియన్స్.