Cucumber | రోజూ ఒక కీరదోసను తప్పనిసరిగా తినాల్సిందే.. దీంతో ఎన్ని లాభాలు కలుగుతాయంటే..?
వేసవి కాలంలో సహజంగానే చాలా మంది చల్లని పదార్థాలను తింటారు. ఐస్ క్రీములు, శీతల పానీయాలు తీసుకుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకునే అనేక మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే వేసవిలో కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాల్లో కీరదోస కూడా ఒకటి.
Cucumber | వేసవి కాలంలో సహజంగానే చాలా మంది చల్లని పదార్థాలను తింటారు. ఐస్ క్రీములు, శీతల పానీయాలు తీసుకుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకునే అనేక మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే వేసవిలో కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాల్లో కీరదోస కూడా ఒకటి. కీరదోస మనకు చలువ చేస్తుంది. ఇందులో అనేక పోషకాలు కూడా ఉంటాయి. రీహైడ్రేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి. కీరదోసలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీ ఉన్నవారికి మేలు చేస్తుంది. వేసవిలో మనకు చెమట అధికంగా పడుతుంది. కానీ కీరదోసను తింటే శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందవచ్చు. అలాగే శరీరం కోల్పోయిన మినరల్స్ కూడా మనకు కీరదోస ద్వారా తిరిగి లభిస్తాయి.
హైబీపీ తగ్గుతుంది..
ఒక కీరదోసను తింటే కేవలం 13 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. ప్రోటీన్లు 0.4 గ్రాములు, పిండి పదార్థాలు 2.5 గ్రాములు, కొవ్వులు 0.1 గ్రాములు, ఫైబర్ 2.6 గ్రాములు, సోడియం 10.2 మిల్లీగ్రాములు, పొటాషియం 50 మిల్లీగ్రాములు లభిస్తాయి. రోజూ ఒక కప్పు కీరదోస రసం సేవిస్తుంటే చర్మం నిగారింపును పొందుతుంది. కీరదోసలో ఫోలేట్, విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు మాయమవుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. కీరదోసలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి కీరదోస ఎంతో మేలు చేస్తుంది.
శిరోజాలు, చర్మ సంరక్షణకు..
కీరదోసను తింటే జుట్టు, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు, గోర్లు చిట్లిపోయే సమస్య ఉన్నవారు రోజూ ఒక కీరదోసను తింటుంటే ఫలితం ఉంటుంది. డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో కీరదోస అద్భుతంగా పనిచేస్తుంది. కీరదోసను రోజూ తింటున్నా లేదా కీరదోసను అడ్డంగా చక్రాల్లా కట్ చేసి కళ్లపై 20 నిమిషాల పాటు పెట్టుకుంటున్నా కూడా కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు తగ్గిపోతాయి. ముఖం అందంగా మారుతుంది. కళ్లు ఉబ్బినట్లు ఉండే వారు కూడా ఈ చిట్కాను పాటించవచ్చు. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కీరదోసను పేస్ట్‌లా చేసి జుట్టుకు అప్లై చేసి కాసేపు అయ్యాక తలస్నానం చేయాలి. దీంతో శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి.
జీర్ణ సమస్యలకు..
కీరదోసలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. కీరదోసను తింటే మనం తిన్న ఆహారాన్ని అది సులభంగా జీర్ణం చేస్తుంది. దీంతో గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కీరదోసలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. అయితే దీన్ని తొక్కతో సహా తింటేనే మనకు విటమిన్ కె లభిస్తుంది. విటమిన్ కె వల్ల గాయాలు అయినప్పుడు రక్త స్రావం అధికంగా అవకుండా రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతోపాటు ఎముకలు కూడా బలంగా మారుతాయి. బరువును తగ్గించడంలో కూడా కీరదోస అద్భుతంగా పనిచేస్తుంది. భోజనానికి ముందు కీరదోసను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తింటారు. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది. ఇలా కీరదోసను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Cucumber
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

