Silk Smitha | సిల్క్ స్మిత ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు కాని అప్పట్లో ఆమె ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. మత్కెక్కించే కళ్లతో ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా తనవైపు తిప్పుకుంది. సినీ ప్రియుల ఆరాధ్య దేవతగా మారిన సిల్క్ స్మిత చాలా బోల్డ్‌గా ఉంటుంది. తన అందచందాలతో సౌత్ సినిమాని దశాబ్దన్నర పాటు శాసించింది సిల్క్ స్మిత. మలయాళ మూవీ ఒట్టపట్టేవార్మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సిల్క్ స్మిత భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన సీతాకోక చిలుక మూవీతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. దాదాపుగా 16 ఏళ్ల పాటు నటిగా రాణించి .. 360కిపైగా సినిమాల్లో నటించి అలరించింది సిల్క్ స్మిత.
కుటుంబ పరిస్థితి వల్ల చదువు మధ్యలోనే ఆపేసిన సిల్క్ స్మితకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత భర్త, అత్తగారి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత బతుకుతెరువు కోసం నటి అపర్ణకు టచ్ అప్ ఆర్టిస్ట్ గా తన సినిమా జీవితాన్ని ప్రారంభించింది. మలయాళ దర్శకుడు ఆంటోనీ ఈస్ట్‌మన్.. సిల్క్ స్మితకి హీరోయిన్ గా అవకాశం ఇవ్వడమే కాకుండా ఆమెకు స్మిత అని పేరు పెట్టారు. అయితే సిల్క్ తొలుత వ్యాంపు రోల్స్ చేయడంతో వాటికి ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. దాంతో ఆమెకి అవకాశాలు పెరిగాయి.మేకర్స్ సిల్క్ స్మిత డేట్స్ కోసం కూడా ఎదురు చూసేవారు.
ఒకవైపు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు వ్యాంపు రోల్స్, ఇంకోవైపు ఐటెమ్ సాంగ్స్ తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపేసింది సిల్క్ స్మిత. ఆమె కళ్లకు చాలామంది అభిమానులు దాసోహం అయ్యారు. మలయాళం, తమిళ హీరోలు అయితే తమ చిత్రాల్లో సిల్క్ స్మిత పాటలు ఉండాలని కోరుకునేవారు. సిల్క్ ఒక్క ఐటమ్ డ్యాన్స్ చేయడానికి 50 వేల వరకు పారితోషికం తీసుకునేదట.అంటే ఇప్పటి కాలంలో 5 కోట్లకు సమానం అని అంటుంటారు.. అంటే ఇప్పటి లెక్క ప్రకారం చూస్తే సమంత, రష్మికలు కూడా ఆమె ముందు దిగదుడుపే అని చెప్పాలి. సినిమా అవకాశాలు తగ్గినప్పుడు సినిమా నిర్మాణం చేయడం ప్రారంభించిన సిల్క్ స్మితకి 2 కోట్ల వరకు నష్టం రావడంతో మద్యపానానికి బానిస అయింది.చివరికి మానసిక ఒత్తిడి, దుఃఖం తట్టుకోలేక సిల్క్ స్మిత 35 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుంది.