IPL 2025 : వాంఖడేలో రికార్డు ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లను కోల్పోయింది. యశ్ దయాల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(17) బౌల్డయ్యాడు. ఆ కాసేపటికే రియాన్ రికెల్టన్(17)ను హేజిల్‌వుడ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. 38కే రెండు వికెట్లు పడ్డాయి. విల్ జాక్స్(14), సూర్యకుమార్ యాదవ్(6)లు మరోవికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. హేజిల్‌వుడ్ వేసిన 6వ ఓవర్లో రెండు రన్స్ ఇచ్చాడంతే. దాంతో, పవర్ ప్లేలో ముంబై 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది.
ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ రెండు ఫోర్లు, ఒక సిక్సర్లు కొట్టాడు. అయితే.. యశ్ దయాల్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయలేక క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడాలనుకున్న మరో ఓపెనర్ రికెల్టన్ .. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోయాడు. కానీ, బంతి మిస్ అయింది. రివ్యూ తీసుకొని మరీ ఆర్సీబీ అతడి వికెట్ సాధించింది.