Virat Kohli : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20ల్లో సంచలనం సృష్టించాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్ అయిన విరాట్ ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 13 వేల పరుగుల క్లబ్లో చేరాడు. ఈ విధ్వంసక బ్యాటర్ 386 ఇన్నింగ్స్‌ల్లోనే 13 వేల క్లబ్లో చేరాడు. ఈ మైలురాయికి చేరుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడీ మాజీ సారథి. ఐపీఎల్ 18వ సీజన్లో రెచ్చిపోయి ఆడుతున్న ఈ ఆర్సీబీ ఓపెనర్ ముంబై ఇండియన్స్(Mumbai Indians)పై అర్థ శతకం బాది ఈ ఫీట్ సాధించాడు.
పొట్టి క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 13 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లు వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్(Chris Gayle) ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. యూనివర్సల్ బాస్ అయిన గేల్ కేవలం 381 ఇన్నింగ్స్‌ల్లోనే టీ20ల్లో 13, 000 రన్స్ బాదేశాడు.
The second-fastest to reach 13,000 runs in men’s T20s 🥈
Virat Kohli (386 inns) is second only to Chris Gayle (381 inns) in the shortest format 🤯 #IPL2025 #MIvRCB pic.twitter.com/0v0ejOszUc
— ESPNcricinfo (@ESPNcricinfo) April 7, 2025
ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలెక్స్ హేల్స్ 474 ఇన్నింగ్సల్లో, పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ 487 ఇన్నింగ్సల్లో, కరీబియన్ మాజీ చిచ్చరపిడుగు కీరన్ పొలార్డ్ 594 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సొంతం చేసుకున్నారు.