IPL 2025 : వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాపార్డర్ దంచికొట్టింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ(67) అర్ధ శతకం సాధించాడు. రజత్ పటిదార్(64) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లేలో బౌండరీలతో చెలరేగిన కోహ్లీ.. పడిక్కల్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత నాలుగో వికెట్‌కు జితేశ్ శర్మ(40 నాటౌట్)తో కలిసి 69 పరుగులు జోడించిన పటిదార్ జట్టు స్కోర్ 200 దాటించాడు. బుమ్రా వేసిన 20వ ఓవర్లో జితేశ్ సిక్సర్ బాదగా ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. నిరుడు 196 రన్స్‌ను అలవోకగా ఛేదించిన ముంబై.. ఈసారి మళ్లీ గర్జిస్తుందా? లేదా? అనేది మరికాసేపట్లో తెలియనుంది.
టాస్ ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ముంబై పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఆదిలోనే షాకిచ్చాడు. తొలి బంతికి బౌండరీ బాదిన ఫిలిప్ సాల్ట్(4)ను రెండో బంతికే క్లీన్‌బౌల్డ్ చేసి ముంబైకి బ్రేకిచ్చాడు. 4 పరుగులకే తొలి వికెట్ పడిన వేళ.. విరాట్ కోహ్లీ(67) జట్టుపై ఒత్తిడి పడనీయలేదు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో 4 కొట్టిన విరాట్.. ఆపై బౌల్ట్ బౌలింగ్‌లోనూ రెండుసార్లు బంతిని బౌండరీకి పంపాడు. విల్ జాక్స్ వేసిన 5వ ఓవర్లో కోహ్లీ ఫోర్ కొట్టగా ఆర్సీబీ స్కోర్ 50కి చేరింది. దీపక్ చాహర్ వేసిన 6వ ఓవర్లో పడిక్కల్ వరుసగా 6, 6, 4 బాదడంతో 20 పరుగులు వచ్చాయి. దాంతో, ఆర్సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది.
Rapid Rajat with a fiery 5️⃣0️⃣ #RCB skipper Rajat Patidar is producing a knock for the ages 👊
Updates ▶ https://t.co/Arsodkwgqg#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/sVfiBLiSOH
— IndianPremierLeague (@IPL) April 7, 2025
భారీ స్కోర్ దిశగా వెళ్తున్న బెంగళూరును పాండ్యా దెబ్బకొట్టాడు. అర్ధ శతకంతో జోరుమీదున్న కోహ్లీని.. లివింగ్‌స్టోన్(0)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత జితేశ్ శర్మ(40 నాటౌట్: 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) జతగా సారథి రజత్ పటిదార్(64: 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాండ్యా వేసిన 17వ ఓవర్లో సిక్సర్ బాది అర్ధ శతకం సాధించిన అతడు.. ఆ ఓవర్లో 6 ,4, 4 కొట్టి జట్టు స్కోర్ 190 దాటించాడు. అయితే.. బుమ్రా 18వ ఓవర్లో ఆరు రన్స్ ఇచ్చాడంతే. బౌల్ట్ వేసిన తొలి బంతిని జితేశ్ స్టాండ్స్‌లోకి పంపాడు. ఆరో వికెట్‌కు 69 రన్స్ జోడించిన పటిదార్‌ను రియాన్ రికెల్టన్ డైవింగ్ క్యాచ్‌తో వెనక్క పంపాడు. బుమ్రా వేసిన 20వ ఓవర్లో.. జితేశ్ లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. దాంతో, ముంబైకి కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది బెంగళూరు.