Babar Azam | వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ జట్టు బీసీసీఐ ఆతిథ్యానికి ఫిదా అయ్యింది. భారత్‌లో ఇలాంటి ఆతిథ్యం ఉంటుందని అస్సలు ఊహించలేదని, తమ ఇంట్లో ఉన్న ఫీలింగే కలుగుతోందని జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ (Babar Azam) అన్నారు.
ప్రతి వరల్డ్ కప్ (World Cup) టోర్నీకి ముందు రోజు సంప్రదాయబద్ధంగా నిర్వహించే కెప్టెన్స్ డే ఈవెంట్ (Captains’ Day press conference)ను బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించారు. గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ (GCA) క్లబ్ హౌస్‌కు చెందిన బాంక్వెట్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో పార్టిసిపేట్ చేస్తున్న 10 జట్ల కెప్టెన్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
ఈ క్రమంలోనే భారత్ ఆతిథ్యంపై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు బాబర్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. ‘భారత్ ఆతిథ్యం అద్భుతం. ఇలాంటి ఆతిథ్యం లభిస్తుందని మేము అస్సలు ఊహించలేదు. ఇక్కడికి వచ్చే ముందు భారత్‌లో మాకు ఎలాంటి మద్దతు లభించదని, అభిమానులు ఎవరూ మాకు అండగా నిలవరనే మాటలు విన్నాను. కానీ మాకు అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మేం ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పటి నుంచి హోటల్, మైదానం వెళ్లే వరకూ అభిమానులు మాకు చీర్స్ చేస్తూ స్వాగతం పలికారు. మేమంతా బస్సుల్లో వెళ్తుంటే కొందరు అభిమానులు మమ్మల్ని అనుసరించారు. అది చూసి మాకు చాలా సంతోషంగా అనిపించింది. మేము హైదరాబాద్‌లో ఒక వారం పాటు ఉన్నాము. చాలా ఆనందంగా గడిపాము. సరదాగా అనిపించింది. ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగింది’ అంటూ చెప్పుకొచ్చారు.
మరోవైపు హైదరాబాద్ పర్యటనలో పాక్ జట్టు హైదరాబాద్ వంటకాలను ఆస్వాదించారు. ఈ క్రమంలోనే హైదరబాదీ స్పెషల్ దమ్ బిర్యానీని ట్రై చేశారు. దీనిపై కూడా బాబర్ స్పందించారు. హైదరాబాద్ బిర్యానీ.. కరాచీ బిర్యానీ ఏది బాగుంది..? హైదరాబాద్ బిర్యానీకి ఎంత రేటింగ్ ఇస్తారు..? అంటూ విలేకరులు బాబర్‌ను ప్రశ్నించారు. దీనికి పాక్ కెప్టెన్ స్పందిస్తూ.. హైదరాబాద్ బిర్యానీ కొంచెం స్పైసీగా ఉందని అన్నారు. ఇది దాని ప్రత్యేకతన అని చెప్పారు. హైదరాబాద్ బిర్యానీకి 10కి 8 మార్కులు ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Captain Babar Azam looks fed up of the Hyderabadi Biryani 😂❤️ pic.twitter.com/IjrgFf2FAK
— SAAD 🇵🇰 (@SaadIrfan258) October 4, 2023
Also Read..
Amitabh Bachchan | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. అమితాబ్ బచ్చన్‌కు భారీ జరిమానా..!
Viral Video | వామ్మో.. ఫ్రిడ్జ్‌ను తలపై బ్యాలెన్స్ చేస్తూ సైక్లింగ్ చేస్తున్న వ్యక్తి
Viral Video | సిగ్నల్ వద్ద వేగంగా దూసుకొచ్చి కారును ఢీ కొట్టిన బస్సు.. షాకింగ్ వీడియో