Viral Video | సిగ్నల్ వద్ద వేగంగా దూసుకొచ్చి కారును ఢీ కొట్టిన బస్సు.. షాకింగ్ వీడియో
Viral Video | రోడ్డు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అతివేగంగా వెళ్తున్న ఓ బస్సు కారును ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Viral Video | రోడ్డు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అతివేగంగా వెళ్తున్న ఓ బస్సు కారును ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతా (Kolkata)లో అక్టోబర్ 2న చోటు చేసుకుంది.
కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో (Salt Lake area) వేగంగా దూసుకెళ్తున్న ఓ బస్సు సిగ్నల్‌ను జంప్ చేసి (bus jumps red light) ముందు వేరే దిశలో వెళ్తున్న కారుపైకి దూసుకెళ్తుంది. అనంతరం డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తాపడుతుంది. ఆ కారు సిగ్నల్ వద్ద వేచిఉన్న ద్విచక్రవాహనాలను ఢీ కొడుతుంది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. ఐదుగురు వ్యక్తులు గాయాలతో బయటపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Accident at College more Saltlake.#accident #kolkata #bus #caraccident pic.twitter.com/z2E0iTHZQf
— Bikramjeet Dutta (@DuttaBikramjeet) October 5, 2023
Also Read..
Sikkim Floods | సిక్కింలో ఆకస్మిక వరదలు.. 14 మంది మృతి.. 102 మంది గల్లంతు
Uttarakhand | ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం.. 3.2 తీవ్రత
Asian Games | ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం.. క్వార్టర్స్‌లోనే వెనుతిరిగిన పీవీ సింధు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

