Uttarakhand | ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం.. 3.2 తీవ్రత
ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) స్వల్పంగా భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 3.49 గంటలకు ఉత్తరకాశీలో (Uttarkashi) భూకంపం (Earthquake) వచ్చింది.
ఉత్తరకాశి: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) స్వల్పంగా భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 3.49 గంటలకు ఉత్తరకాశీలో (Uttarkashi) భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఉత్తరకాశీకి 33 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
గత 48 గంటల్లో రాష్ట్రంలో భూకంపం రావడం ఇది రెండోసారి. మంగళవారం పిథోరఘర్‌లో 4.3 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే. అంతకుముందు అదే రోజు నేపాల్‌లో వరుసగా నాలుగు భూకంపాలు వచ్చాయి.
Earthquake of Magnitude:3.2, Occurred on 05-10-2023, 03:49:47 IST, Lat: 31.00 & Long: 78.29, Depth: 5 Km ,Location: Uttarkashi, Uttarakhand, India for more information Download the BhooKamp App https://t.co/aQfKwpUVIx @ndmaindia @Indiametdept @KirenRijiju @Dr_Mishra1966 pic.twitter.com/g68mMwjWsv
— National Center for Seismology (@NCS_Earthquake) October 4, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Earthquake
- NCS
- Nepal
- Uttarakhand
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

