Amitabh Bachchan | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. అమితాబ్ బచ్చన్‌కు భారీ జరిమానా..!
Amitabh Bachchan | పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ ఆన్లైన్ రిటైల్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart ) బిగ్ బిలియన్ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ‘బిగ్ బిలియన్ డేస్’ (Big Billion Days sale) పేరుతో భారీ సేల్ నిర్వహిస్తోంది.
Amitabh Bachchan | పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ ఆన్లైన్ రిటైల్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart ) బిగ్ బిలియన్ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ‘బిగ్ బిలియన్ డేస్’ (Big Billion Days sale) పేరుతో భారీ సేల్ నిర్వహిస్తోంది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్ పెట్టింది. అయితే ఈ సేల్కు సంబంధించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)తో ఓ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఇటీవలే విడుదల చేసింది. అయితే, ఈ ప్రకటనపై ఇప్పుడు వివాదం రాజుకుంది. ఈ వివాదంతో బిగ్‌బీ కూడా చిక్కుల్లో పడ్డారు.
ఫ్లిప్‌కార్ట్ ప్రకటనపై ఆల్ ఇండియా ట్రేడర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేదిలా ఉందని, చిన్న వర్తకులకు వ్యతిరేకంగా ఉందని సీఏఐటీ (Confederation of All India Traders) ఆరోపించింది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల పరిరక్షణ విభాగానికి (Central Consumer Protection Authority ) ఫిర్యాదు చేసింది. అదేవిధంగా ఈ యాడ్‌లో నటించిన అమితాబ్‌పై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆయన చేసిన యాడ్ భారతదేశంలోని రిటైలర్లకు బాగా నష్టం వాటిల్లేలా ఉందని పేర్కొంది. ఈ ప్రకటనను వెంటనే తొలగించడమే కాకుండా ఫ్లిప్‌కార్ట్, అమితాబ్‌కు రూ.10లక్షలు చొప్పున జరిమానా విధించాలని డిమాండ్ చేసింది.
Also Read..
Viral Video | సిగ్నల్ వద్ద వేగంగా దూసుకొచ్చి కారును ఢీ కొట్టిన బస్సు.. షాకింగ్ వీడియో
Sikkim Floods | సిక్కింలో ఆకస్మిక వరదలు.. 14 మంది మృతి.. 102 మంది గల్లంతు
Viral Video | వామ్మో.. ఫ్రిడ్జ్‌ను తలపై బ్యాలెన్స్ చేస్తూ సైక్లింగ్ చేస్తున్న వ్యక్తి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

