కౌలాలంపూర్: మలేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 10-21, 15-21తో కొరియా జోడీ కిమ్వోన్ హో, సియో సంగ్ చేతిలో ఓటమిపాలైంది. 40 నిమిషాల వ్యవధిలోనే ముగిసిన మ్యాచ్‌లో ఏడో సీడ్ సాత్విక్ జంట స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది.
వరుసగా మూడోసారి సెమీస్ చేరి టైటిల్‌పై ఆశలు రేపిన ఈ యువ జోడీ వరుస గేముల్లో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఓడిపోవడం ఒకింత నిరాశ కల్గించిదని, కానీ దీని నుంచి నేర్చుకుని ముందంజ వేస్తామని మ్యాచ్ తర్వాత సాత్విక్ పేర్కొన్నాడు.