Sarfaraz Khan : రంజీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)కు సూపర్ చాన్స్ దక్కింది. ఈమధ్యే టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ యువకెరటం ముంబై (Mumbai) జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్ ఆరంభ టోర్నీ బుచ్చి బాబు (Buchi Babu) టోర్నెమెంట్లో అజింక్యా రహానే (Ajinkya Rahane) స్థానంలో సర్ఫరాజ్ ముంబైని నడిపించనున్నాడు.
ఆదివారం ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) ఈ టోర్నీ కోసం 17 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. 2023-24 రంజీలో ముంబైని చాంపియన్‌గా నిలిపిన రహానే(Ajinkya Rahane), వైస్ కెప్టెన్ షామ్స్ ములానీ(Shams Mulani)లు బుచ్చిబాబు టోర్నీకి అందుబాటులో లేరు. దాంతో, ఎంసీఏ సర్ఫరాజ్‌కు పగ్గాలు అప్పగించింది.
#SarfarazKhan named as Captain of Mumbai team for Buchi Babu Tournament in Chennai
Siddhesh Lad return to Mumbai for 2024-25 season #CricketTwitter pic.twitter.com/1O6wr8Uf3R
— Rajesh Khilare (@Cricrajeshpk) August 4, 2024
ముంబై స్క్వాడ్ : సర్ఫరాజ్ ఖాన్(కెప్టెన్), దివ్యాన్ష్ సక్సేనా, అమోఘ్ భత్కల్, అఖిల్ హెర్వాడ్కర్, సిద్ధేశ్ లాడ్, ముషీర్ ఖాన్, నూతన్, గోయల్, సూర్యాన్స్ షెడ్గే, హార్ధిక్ తమొరె, ప్రసాద్ పవార్, తనిష్ కొటియాన్, అథర్వ అంకొలెకర్, హిమాన్ష్ సింగ్, ధనిత్ రౌత్, సిల్వెస్టర్ డిసౌజా, జునైద్ ఖాన్, హర్ష్ తన్నా.
‘రహానే తిరిగి వచ్చాక ముంబై కెప్టెన్‌గా ఎవరు? అనే ప్రశ్న ఎదురవ్వదు. అతడి గైర్హాజరీలో ఉన్నవాళ్లలో అనుభవజ్ఞుడు, టెస్టు ఆటగాడు అయిన సర్ఫరాజ్ జట్టును నడిపిస్తాడు’ అని ఎంసీఏ సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ తెలిపాడు.
టీమిండియాలో చోటు కోల్పోయిన రహానే ఇరానీ కప్(Irani Cup)లో బరిలోకి దిగనున్నాడు. ముంబైకి 42వ రంజీ ట్రోఫీ కట్టబెట్టిన అతడు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నాడు. అక్కడి లీసెస్టర్‌షైర్ తరఫున రహానే వన్డే కప్ ఆడుతున్నాడు. ఇక ములానీ విషయానికొస్తే అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు.