Sanju Samson : భారత క్రికెటర్లలో సంజూ శాంసన్ (Sanju Samson)కు ప్రతిభలో కొదువ లేదు. కానీ, విధి
అతడితో ఆట ఆడకుంటున్నట్టుంది. ఎందుకంటే..? ఇప్పటికే జట్టులో పాతుకుపోవాల్సిన అతడు అడపాదడపా టీమిండియా జెర్సీ వేసుకుంటున్నాడు. అందుకనే కాబోలు శాంసన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా దురదృష్టానికి కేరాఫ్ అని ఎవరైనా చెప్పేస్తారు. టీ20ల్లో దంచికొట్టే సంజూ వన్డేల్లో మాత్రం అవకాశాల్ని అందిపుచ్చుకోలేకపోతున్నాడు.
శ్రీలంక పర్యటనతో రాక రాక వచ్చిన అవకాశాన్ని సైతం అందుకోలేక విమర్శలయ్యాడు. వరుసగా మొదటి రెండు వన్డేల్లో సున్నా చుట్టేసి జట్టుతో పాటు కొత్త కోచ్ గౌతం గంభీర్‌ను సైతం తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో, మళ్లీ వన్డే అవకాశం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇదే విషయంపై ఈ పవర్ హిట్టర్ ఏమన్నాడంటే..?
లంక పర్యటన తర్వాత స్వదేశం వచ్చిన శాంసన్ ఈమధ్యే కేరళ క్రికెట్ లీగ్ (Kerala Cricket League)ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వన్డేల్లో సెంచరీ కొట్టిన తర్వాత కూడా మిమ్మల్ని ఎందుకు పక్కనపెట్టారు? అనే ప్రశ్న అడిగారు. అందుకు సంజూ నవ్వుతూ ఏం చెప్పాడంటే.. ‘నన్ను సెలెక్టర్లు ఎప్పుడు ఎంపిక చేసినా వెళ్లి ఆడుతాను.
The Kerala Boy at a press conference🔥#SanjuSamson pic.twitter.com/gsdv9SSHlP
— Deepu (@deepu_drops) August 10, 2024
అంతే. అంతిమంగా ఆరోజు మా జట్టు బాగా ఆడిందా? లేదా? అనేది నాకు ముఖ్యం. ఇక నేను అన్ని విషయాల్ని పాజిటివ్‌గానే చూస్తాను. నాకు సాధ్యమైనంత మేర పోరాడుతాను’ అని శాంసన్ తెలిపాడు. ఐపీఎల్లో రెచ్చిపోయి ఆడే శాంసన్ వన్డేల్లో మాత్రం ఒక్క శతకం మినహా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఇప్పటివరకూ 16 వన్డేల్లో 510 పరుగులు సాధించాడు.
వన్డే వరల్డ్ కప్ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో సంజూ కీలక ఇన్నింగ్స్ ఆడాడ. సెంచరీతో చెలరేగాడు. దాంతో, టీమిండియా 78 పరుగులతో గెలుపొంది 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. దాంతో, ఈ కేరళ క్రికెటర్‌కు జట్టులో చోటు ఖాయమని అనుకున్నారంతా. కానీ, సెలెక్టర్లకు ఇంకా అతడిపై నమ్మకం కుదిరినట్టు లేదు. అందకనే కాబోలు తాజాగా శ్రీలంక సిరీస్‌కు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌లను ఎంపిక చేశారు. దాంతో, సంజూ బ్యాకప్‌గా లంకకు వెళ్లినట్టు అయింది. అయితే.. తొలి రెండు వన్డేల్లో కోచ్ గంభీర్ శాంసన్‌కు చాన్స్ ఇచ్చాడు. కానీ, మనోడు రెండు మ్యాచుల్లో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు.